గురువారం 28 మే 2020
Hyderabad - May 08, 2020 , 00:33:39

మరో 2450 మంది తరలింపు

మరో 2450 మంది తరలింపు

మేడ్చల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బుధవారం రాత్రి సుమారు 2,450 మంది బీహార్‌ కార్మికులను తరలించారు.  వీరికి రెండు పూటల భోజనం, ఉదయం టిఫిన్‌, 3 లీటర్ల మినరల్‌ వాటర్‌, పండ్లు, స్వీట్లతో  పాటు లస్సీనీ అందించారు. గురువారం రాత్రి కూడా సుమారు 2 వేల మంది కార్మికులను ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

కంటైన్మెంట్‌ ప్రాంతాల ఎత్తివేత

జిల్లాలో జీహెచ్‌ఎంసీ పరిధి మినహా మిగిలిన ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదుకాని నాలుగు కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేస్తున్నట్లు మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన కుటుంబాల వారు హోం క్వారెంటైన్‌ నిబంధనలు  పాటించాలని సూచించారు. 


logo