మైలార్‌దేవ్‌పల్లి, మార్చి 12: అక్రమంగా కల్తీ వస్తువులను తయారు చేసి మార్కెట్లో చలామనీ చేస్తున్న కేంద్రంపై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో వివిధ రకాల కిరాణా వస్తువుల సీజ్ చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని స్వాధీనం చేసుకున్న మిషనరీ, సామగ్రీని ఎస్ఓటీ పోలీసులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మధుబన్‌కాలనీలో వీరేంద్ర ఘొహ్లాట్ గదిని అద్దెకు తీసుకొని అందులో కల్తీ వస్తువులు ఒరిజినల్ అన్నట్లుగా ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తున్నాడన్నారు. స్గాపూస్, వాషింగ్ పౌండర్, టీ పౌడర్లు వివిధ వినియోగ వస్తువులపై లేబుల్‌ను ఉపయోగించుకుంటున్నారన్నారు. ఈ మేరకు హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీ మేనేజర్ ఖలీల్ అహ్మద్ ఎలాంటి అనుమతులు లేకుండా వస్తువులను తయారు చేసి తమ లేబుల్స్‌ను ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశాడన్నారు. నిందితుడు వీరేంద్ర ఘొహ్లాట్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ప్యాకింగ్ మెటీరియల్, స్మాల్ మిషనరీ, మెటీరియల్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాపీ రైట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.