ఆర్థిక నేరాల కట్టడికి.. ‘ఈవోడబ్ల్యూ’
ఆర్థిక నేరాల కట్టడికి సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) ఠాణా ఏర్పాటైంది. గతంలో ఏవైనా ఆర్థిక నేరాలు జరిగితే స్థానిక ఠాణాల్లో కేసులు నమోదు అయ్యేవి. పెద్ద కేసులు మాత్రమే క్రైమ్ విభాగం పరిధిలోని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ అయ్యేవి.
- రెండు నెలల్లో 20 కేసులు నమోదు
సిటీబ్యూరో: ఆర్థిక నేరాల కట్టడికి సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) ఠాణా ఏర్పాటైంది. గతంలో ఏవైనా ఆర్థిక నేరాలు జరిగితే స్థానిక ఠాణాల్లో కేసులు నమోదు అయ్యేవి. పెద్ద కేసులు మాత్రమే క్రైమ్ విభాగం పరిధిలోని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ అయ్యేవి.
కానీ ఇప్పుడు ఇతర విభాగాల మాదిరిగానే ఆర్థిక నేరాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈవోడబ్ల్యూ విభాగాన్ని ఏర్పాటు చేయగా, డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ విభాగం పనిచేస్తుంది. నలుగురు ఏసీపీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్ల చొప్పున మొత్తం 9 మంది అధికారులు ఈ విభాగంలో ఆర్థిక నేరాల దర్యాప్తు, నేరాల నియంత్రణ తదితర అంశాలపై పనిచేస్తున్నారు. రూ.3 కోట్లు లేదా ఆపై జరిగే ఆర్థిక నేరాలన్నీ ఈవోడబ్ల్యూ ఠాణాకు బదిలీ అవుతాయి. బాధితులు నేరుగా వచ్చి కూడా ఈవోడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేయవచ్చు.
ఆర్థిక నేరాలు తగ్గించేందుకే.. అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీ
ప్రస్తుతం ఆర్థిక, సైబర్‌క్రైమ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని బాధితులకు సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశంతో సైబరాబాద్ కమిషనరేట్‌కు ప్రత్యేకంగా ఈవోడబ్ల్యూ ఠాణాను ఏర్పాటు చేశాం. దీని వల్ల ఆర్థిక నేరాలకు గురైన బాధితులు ఇక నుంచి నేరుగా ఈ ఠాణాలో ఫిర్యాదు చేయవచ్చు.
రెండు నెలల్లో 20 కేసులు ప్రసాద్, డీసీపీ(ఈవోడబ్ల్యూ)
ఈవోడబ్ల్యూ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేశాం. అంతకు ముందు 22 కేసులు నమాదయ్యాయి. దాదాపు అన్ని కేసుల్లో దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేశాం. ఈ మధ్య ఎక్కువగా ఫ్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో కొన్ని ముఠాలు అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నాయి. భారతి బిల్డర్స్, సాహితీ ఇన్ఫ్రా, సీహ్వా, ఇస్తరా పార్క్ ప్రై.లి వంటి కేసుల్లో బాధితులు కోట్ల రూపాయలు మోసపోయారు. నిందితులను అరెస్టు చేశాం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

