కొవిడ్ టీకాల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
Covid Vaccine | జాంబాగ్ యూపీహెచ్‌సీలో జరిగిన కొవిడ్ టీకాల చోరీ కేసును మీర్‌చౌక్ పోలీసులు ఛేదించారు. యూపీహెచ్‌సీలో నిన్న కొవిడ్ టీకాలను దొంగిలించిన విషయం తెలిసిందే. నిందితులు జావిద్, గౌస్‌ను పోలీసులు అరెస్టు

హైదరాబాద్ : జాంబాగ్ యూపీహెచ్‌సీలో జరిగిన కొవిడ్ టీకాల చోరీ కేసును మీర్‌చౌక్ పోలీసులు ఛేదించారు. యూపీహెచ్‌సీలో నిన్న కొవిడ్ టీకాలను దొంగిలించిన విషయం తెలిసిందే. నిందితులు జావిద్, గౌస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కొవాగ్జిన్ 27, కొవిషీల్డ్ 17 వయల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొవిడ్ టీకాతో పాటు బీసీజీ 22, ఓపీవీ 44, డీపీటీ 15 వంటి మెడిసిన్స్‌ను కూడా అపహరించారు. యూపీహెచ్‌సీలో ఉన్న కంప్యూటర్ మానిటర్, సీపీయూలు, కీ బోర్డులను ధ్వంసం చేశారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం కొత్తగా 1,825 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 3.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది. మరోవైపు 351 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15వేలకు చేరుకొన్నది. రికవరీ రేటు కాస్త తగ్గి 97.26 శాతంగా నమోదైంది.
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,042, మేడ్చల్ మల్కాజిగిరి 201, రంగారెడ్డి 147, సంగారెడ్డి 51, హనుమకొండలో 47 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్క కేసు కూడా నమోదుకాని ములుగు జిల్లాలో 2 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోమవారం కేసులు నమోదయ్యాయి. అటు.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 2.74 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 1.13 లక్షల మందికి మొదటిడోస్, 1.39 లక్షల మందికి రెండో డోస్, 22,045 మందికి బూస్టర్ డోస్ వేశారు. 15-18 ఏండ్లు మధ్య వయసు వారికి ఇప్పటి వరకు 7.52 లక్షల మదికి టీకాలు వేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

