Rain Update | సిటీబ్యూరో, డిసెంబరు 20 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నగరంలో రాగల రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరిగి, చలి తీవ్రత తగ్గింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30.5డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.3డిగ్రీలు, గాలిలో తేమ 58శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.