బండ్లగూడ, జూలై 13: విద్యుత్ షాక్తో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హసన్నగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్(14) తన స్నేహితుడు కేబుల్ ఆపరేటర్ కావడంతో అతడి వెంట వర్షంలో వెళ్లాడు.
ఈ క్రమంలో విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడంతో కరెంటు షాక్ తగిలి కింద పడిపోయాడు. పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.