ఫిట్నెస్ లేకుండా.. రోడ్డెక్కితే సీజ్
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తేనే పిల్లలు క్షేమంగా ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లలో కొందరు మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారు.
- గ్రేటర్లో 13,502 విద్యా సంస్థల బస్సులు
సిటీబ్యూరో : బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తేనే పిల్లలు క్షేమంగా ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లలో కొందరు మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారు. పోలీసుల తనిఖీలోపదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఈ నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలతో చెలగాటలాడమే అవుతుందని తల్లిదండ్రులు విద్యా సంస్థల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్ట్‌టైం డ్రైవర్లను నియమించుకుని వారి బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీఏ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా విద్యా సంస్థలు చెలరేగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు ప్రారంభం కాబోతుండటంతో బస్సులన్నీ ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
గ్రేటర్లో 13,502 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 1247, మేడ్చల్ మల్కాజిగిరిలో 6058, రంగారెడ్డిలో 6197 బస్సులు ఉన్నాయి. మొత్తం 13,502 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. వీరికి ఆర్టీఏ ప్రతీ స్కూల్ ప్రారంభానికి ముందర రోడ్ సేఫ్టీ, డ్రైవర్ల నియామక సామార్థ్యం, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బస్సు కండిషన్, ఆ బస్సుపై ఉండాల్సిన రంగులు, అక్షరాలు తదితర అన్నీ అంశాలపై సూచనలు ఇస్తారు. ఇప్పటి వరకు సుమారు 3వేల విద్యా సంస్థల బస్సులు అసలు ఫిట్నెస్ పరీక్షకే రాలేదని అధికారులు చెబుతున్నారు. అలాంటి విద్యా సంస్థల బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 30లోపు ఫిట్నెస్ ప్రక్రియ పూర్తిచేయాలని చెప్పారు.
ఇవి పాటించాల్సిందే..!
- మోటార్ వాహనాల చట్టం ప్రకారం 1. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), 2. వ్యాలీడ్ ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్, 3. వ్యాలీడ్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 4. పర్మిట్, 5. ట్యాక్స్ పేమెంట్ రశీదు(బకాయిలు లేకుండా), 6. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్, 7. డ్రైవింగ్ చేసే డ్రైవర్ లైసెన్సు తప్పక వాహనంతో ఉండాలి.
- ప్రభుత్వ సూచనల మేరకు ఐదు రకాల వాహనాల వేగానికి కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో విద్యాసంస్థల బస్సులు కూడా ఉన్నాయి. ఫిటెనెస్కు ముందే ఆయా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు ఉండేలా చూడాల్సి ఉంటుంది. వాహనం డ్రైవర్ 60 సంవత్సరాలకు మించి ఉండరాదు. డ్రైవర్‌కు సంబంధించిన ఆరోగ్య వివరాలు బస్సులో అతికించాలి. కనీసం ఐదు సంవత్సరాలు డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వాహనంలో ఫిర్యాదుల పట్టికను ఏర్పాటు చేసి ఫిర్యాదులను ప్రతి నెలకు ఒకసారి పరిశీలించాలి.
- ప్రతి వాహనంలో అత్యవసర ద్వారం పెట్టాలి. పెద్ద అక్షరాలతో రాయించాలి. వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ప్రతి బస్సులో విద్యార్థుల పేర్లు, ఇంటి చిరునామా, తరగతులు, దిగాల్సిన ప్రదేశం పేర్ల పట్టికతో పాటు రూట్ మ్యాప్ తప్పని సరి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

