Flights Cancel : శంషాబాద్ (Shamshabad) లోని అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) లో ఇవాళ (మంగళవారం) మొత్తం 13 విమానాలు (13 flights) రద్దయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు.
రద్దయిన విమానాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సినవి ఏడు, ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సినవి ఆరు ఉన్నాయి. ఢిల్లీకి వెళ్లాల్సిన ఏడు రద్దయిన విమానాల్లో ఐదు ఇండిగో విమానాలు కాగా.. రెండు ఎయిర్ ఇండియా విమానాలు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు రావాల్సిన ఆరు రద్దయిన విమానాల్లో ఐదు ఇండిగో విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమానం ఉన్నాయి.
కాగా విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎయిర్‌లైన్స్ సిబ్బందిని కోరుతున్నారు.