
మన్సూరాబాద్, జనవరి 12: ఎల్బీనగర్ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ సహారాస్టేట్స్‌కాలనీ రెండో గేటు సమీపంలోని వివేకానందనగర్ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ మాజీ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం స్వామి వివేకానంద 159వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొన్ని కాలనీల్లో కొందరు అధికారుల తప్పిదాలతో ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. ఆటోనగర్ పాత డంపింగ్ యార్డు స్థలంలో అతి సుందరమైన ఫ్లవర్ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలింపు ప్రక్రియ ముగిసిందని, త్వరలో సదరు స్థలంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. వీరన్నగుట్టలో రూ. 10.50 కోట్లతో స్వయంభూ శివాలయ ప్రాంగణాన్ని, సాహెబ్‌నగర్‌లో రూ. 10 కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
కామినేని ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు స్వచ్ఛమైన గాలి లభించడమే కాకుండా ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు. దేశ ప్రజలే ఆశ్చర్యపడేలా ఎల్బీనగర్ నియోజకవర్గం రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, కర్మన్‌ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్ యాదవ్, వెంకట్‌రెడ్డి, నాయకులు రఘువీర్‌రెడ్డి, సాంబిరెడ్డి, వేములయ్య గౌడ్, రుద్ర యాదగిరి, వెంకన్న కురుమ, రాంచంద్రారెడ్డి, రాంబాబు, వెంకటాచార్యులు, బాలరాజు గౌడ్, యాద సంతోష్ కుమార్ గుప్తా, చంద్రమోహన్, కంచర్ల రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి..
ఎల్బీనగర్, జనవరి 12: ప్రజలు అన్నిరకాల కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. గడ్డిఅన్నారం డివిజన్లోని రెడ్డీ బ్రదర్స్ వీధిలో టీఆర్ఎస్ పార్టీ గడ్డిఅన్నారం నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటుగా గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రవీణ్, మాజీ కౌన్సిలర్లు కందికంటి ప్రేంనాథ్గౌడ్, జి. రమేశ్ ముదిరాజ్, నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, శ్రీశైలం యాదవ్, రమణారెడ్డి, మల్లికారెడ్డి, కృష్ణారెడ్డి, సుందరం, సత్యం, రుషీ, రవిచ నదీం, రాజు, శంకర్, ప్రదీప్, విజయమ్మ, శైలజ, రాణిరావు, విజయలక్ష్మి, పార్వతి, లక్ష్మి, పద్మ, అరుంధతి, నాగమణి, ఉమ, వరలక్ష్మి, హసీనా, ఉష, రెడ్డీ బ్రదర్స్ యజమానులు ప్రకాశ్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.