సుల్తాన్‌బజార్, నవంబర్ 14:నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజేందర్‌నగర్‌కు చెందిన అహ్మద్ మాలిక్(32) మద్యం మత్తులో వేగంగా కారును నడుపుతూ..
బిర్యానీ కోసం బజార్‌ఘాట్‌లోని అహమద్దుల్లా హోటల్‌కు వెళ్తున్న క్రమంలో రెడ్‌హిల్స్ నిలోఫర్ కేఫ్ వద్ద చాయ్ తాగుతున్న జనాలపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 12 మందికి గాయపడ్డారు. వీరిలో మోయినుద్దీన్‌కు తీవ్రగాయాలయ్యాయి. కారుతో పాటు ఎనిమిది బైకులు ధ్వంసమయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన అహ్మద్ మాలిక్‌ను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.