సుల్తాన్‌బజార్,జూన్ 17 : ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రాంగణంలోని బాయ్స్ హాస్టల్లో ఉస్మానియా దంత కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది బీడీఎస్ విద్యార్థులపై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేయగా, వారిని కళాశాల ప్రిన్సిపాల్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. కాగా, ఈ నెల 8 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ ర్యాగింగ్ మంగళవారం తారా స్థాయికి చేరుకోవడంతో బీడీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, బీడీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు కోఠిలోని ఓఎంసీ బాయ్స్ హాస్టల్లో గొడవపడ్డారు. కాగా, ఈ గొడవను ఆపేందుకు వెళ్లి ఓ హౌస్ సర్జన్ కన్నుకు గాయమైనట్లు కూడా సమాచారం.
ఉస్మానియా దంత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ ర్యాగింగ్ పాల్పడి గొడవకు కారణమైన 12 మంది బీడీఎస్ సీనియర్ విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా దంత కళాశాల, దవాఖానలో ర్యాగింగ్‌కు తావు లేదని ప్రిన్సిపాల్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ విద్యార్థులు ఇచ్చిన సమాచారం మేరకు విచారించి మంగళవారం సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్లో ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది బీడీఎస్ సీనియర్ విద్యార్థులపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదుఆరు నెలలుగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులను వివిధ రకాలుగా వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కాగా, ర్యాగింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన హౌస్ సర్జన్‌పై దాడికి దిగినట్లు వెల్లడించారు. గతంలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను పిలిపించి హెచ్చరించినా.. వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి జరిగిన ఘటనల వివరాలను తెలియజేశామన్నారు. పోలీసుల నివేదిక అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
మంగళవారం ఉస్మానియా దంత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉస్మానియా మెడికల్ కళాశాలలోని బాయ్స్ హాస్టల్లో విచారించి 12 మంది బీడీఎస్ సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపారు. ఆరు నెలలుగా జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో చేసినట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం 12 మంది విద్యార్థులను అరెస్టు చేస్తామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు.