చార్మినార్, ఏప్రిల్ 5 : ప్రభుత్వం పేదల కడుపు నింపడానికి నెలవారీగా రేషన్ దుకా ణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుం ది. దాన్ని కొందరు తమ లాభసాటి వ్యాపారంగా మార్చుకుం టూ సులువుగా అక్రమర్జనకు పాల్పడుతూ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. దక్షణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించినట్లు అదనపు డీసీపీ అందే శ్రీనివాస రావు తెలిపారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాయణ గుట్ట ప్రాంతానికి చెందిన వికార్, అలీంలు స్థానికంగా ఉన్న రేషన్ దుకాణాల నుండి బియ్యం కొనుగోళ్లు చేస్తున్న వారి నుండి కొంత డబ్బు చెల్లించి బియ్యాన్ని సేకరిస్తు న్నారు.అలా వివిధ ప్రాంతాల నుండి సేకరించిన బియ్యా న్ని మహారాష్ర్టానికి తరలించి అధిక ధరలకు అమ్ముకుంటు కున్నారు.
ప్రతి నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు జోరుగా సాగుతున్న ఈ వ్యవహారంపై కన్నేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమా చారం అందడంతో ఆదివారం వికార్ ఇంటిపై సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి దాడి చేశారు. దాడులలో సుమారు రూ.4 లక్షల విలువైన 103 క్వింటాల బియ్యాన్ని తరలించడానికి సిద్ధం గా ఉన్న డీసీఎం వాన్ తోపాటు డ్రైవర్ మహమ్మద్ యూసుఫ్ (45)ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు వికార్,అలీమ్ లు పారిపోయారని డీసీపీ తెలిపారు.