Secunderabad | సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలగిరిలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఓ స్కూటీని ఆర్మీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. బాలుడి తల్లి తీవ్రంగా గాయపడింది.
తన కుమారుడిని ఓ తల్లి స్కూటీపై తీసుకెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్మీ ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.