కొత్తూరు, మార్చి 30: లారీని వెనుక నుంచి ఓల్వో బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాట్కో జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజాయున జరిగింది. కొత్తూరు సీఐ నరసింహారావు వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి పీడీఎస్ బియ్యంతో రాజేంద్రనగర్ వెళ్తుంది.
అయితే నేషనల్ హైవే 44పై కొత్తూరు మున్సిపాలిటీ నాట్కో జంక్షన్ వద్దకు రాగానే బీసీవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు వెనుక నుంని లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని రాజేంద్ర, బాలాజీ, ఆయన భార్య, బస్సు డ్రైవర్ శ్రీనివాసులుతో పాటు మొత్తం 10 మందికి గాయాలయ్యాయి. వీరిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ఓంకార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళీగౌడ్ తెలిపారు.