
కాచిగూడ,జనవరి 7: అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు డివిజన్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్‌డిపో లైన్లో రూ.48.5 లక్షలు, డివిజన్లోని దశరథ్ లైన్ సమీపంలో రూ.4 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన మంచినీటి పైపులైన్ పనులను శుక్రవారం ఎమ్మెల్యే, కార్పొటర్ ఉమాదేవి ప్రారంభించారు. అనంతరం బస్తీలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ పర్యటించి స్థానిక ప్రజల నుంచి నీటి, డ్రైనేజీ, పలు సమస్యలను తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని బస్తీ, కాలనీల్లో సీసీ రోడ్లను వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు స్థానిక ప్రజలు పరిశీలించినప్పుడే నాణ్యమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అర్హులైన పేద ప్రజలకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వడంతో పొరుగు రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర భీష్మదేవ్, కన్నె రమేశ్‌యాదవ్, సునీల్ బిడ్లాన్, డాక్టర్ శిరీషా యాదవ్, ఓం ప్రకాశ్ యాదవ్, రవీందర్ యాదవ్, బి.కృష్ణాగౌడ్, ఈఈ శంకర్, డీఈ సువర్ణ, ఏఈ ప్రేరణ, సంపత్, జలమండలి మేనేజర్ భావన, దాత్రిక్ నాగేందర్ బాబ్జి, సదానంద్, సంతోష్‌కుమార్, రమాదేవి, బబ్లూ, విజితారెడ్డి, సుభాష్‌పటేల్, సునీల్, నర్సింగ్‌రావు, మల్లికార్జున్, మహేందర్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి మందులు అందజేత
అంబర్‌పేట, జనవరి 7: బాగ్‌అంబర్‌పేట డివిజన్ భరత్‌నగర్‌కు చెందిన కాపరవేని నర్సింగ్‌రావు కొవిడ్ సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. ఆపరేషన్ చేసి స్టంట్స్ వేశారు. అతని ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం భరత్‌నగర్‌లోని నర్సింగ్‌రావు ఇంటికి వెళ్లి రూ.12వేల విలువ చేసే మందులను అందజేశారు.