
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత
ఎర్రగడ్డ, జనవరి 7: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ డివిజన్ ఆనంద్‌నగర్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఎర్రగడ్డ అభివృద్ధికి నోచుకోలేదని.. కేవలం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చేవారని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. లబ్ధిదారులకు చెక్కులతో పాటు ఎమ్మెల్యే తన తరపున కానుకలను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్‌బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్‌షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు సంజీవ, నేతలు పల్లవి మహేందర్‌యాదవ్, గంట మల్లేశ్, సర్దార్, రాము, అజీమ్, రెవెన్యూ అధికారి నందకిశోర్ పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
బంజారాహిల్స్,జనవరి 7: పేదలకు అండగా ఉం టూ అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం రహమత్‌నగర్ డివిజన్‌కు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా తదితర సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతాలు చేస్తూ చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.