ఇందిరా పార్ బచావో
ఇందిరాపార్క్‌లో కరాటే, స్కేటింగ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకంపై స్థానికులు, వాకర్ల ఫిర్యాదుతో ‘హైడ్రా’ ఆక్రమణలకు కు బ్రేక్ వేసినా.. సదరు నిర్వాహకుడు మాత్రం వెనకి తగ్గడం లేదు. గతంలో సేటింగ్ రింగ్‌గా ఉన్న దాదాపు ఎకరం స్థలం కొంతకాలంగా నిరుపయోగంగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు వ్యక్తి క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తానంటూ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ వింగ్ అధికారులను బురిడీ కొట్టించారు.
- రేపు వాకర్ల ధర్నా
సిటీబ్యూరో: ఇందిరాపార్క్‌లో కరాటే, స్కేటింగ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకంపై స్థానికులు, వాకర్ల ఫిర్యాదుతో ‘హైడ్రా’ ఆక్రమణలకు కు బ్రేక్ వేసినా.. సదరు నిర్వాహకుడు మాత్రం వెనకి తగ్గడం లేదు. గతంలో సేటింగ్ రింగ్‌గా ఉన్న దాదాపు ఎకరం స్థలం కొంతకాలంగా నిరుపయోగంగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు వ్యక్తి క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తానంటూ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ వింగ్ అధికారులను బురిడీ కొట్టించారు.
దీంతో స్పోర్ట్స్ వింగ్ అధికారులు ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే ఆ స్థలాన్ని సదరు వ్యక్తికి అప్పగించారు. దీంతో అకడ కరాటే శిక్షణ పేరుతో షెడ్లు వేసి, శాశ్వత నిర్మాణాలకు మెటీరియల్ సిద్ధం చేశారు. స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణలను నేలమట్టం చేశారు. ఆ స్థలాన్ని అర్బన్ బయోడైవర్సిటీ వింగ్‌కు అప్పగించాలని హైడ్రా ఆదేశించింది. అయితే ఆ స్థలం ఇంకా యూబీడీ వింగ్‌కు పూర్తి స్థాయిలో చేరలేదు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ వింగ్‌లో ఓ అధికారి సదరు ప్రైవేట్ వ్యక్తికి ‘గాడ్ ఫాదర్’గా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఇందిరా పార్క్ బచావో పేరిట ఆదివారం ఇందిరాపార్క్ వాకర్స్ ప్రొటెక్షన్ కమిటీ ధర్నాకు పిలుపునిచ్చింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

