సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): బ్యాంకు అధికారులు, జాబ్ కన్సల్టెన్సీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌నేరగాళ్ల కోసం హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఢిల్లీ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఇప్పటికే నాలుగు కాల్సెంటర్లపై దాడి చేసి నలుగురు నిర్వాహకులను అరెస్ట్ చేసి.. నగరానికి తరలించగా, మరింత మంది నేరస్తుల కోసం అన్వేషిస్తున్నారు.
జాబ్ కన్సల్టెన్సీల పేరుతో కాల్సెంటర్లను నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయడంతో మరో ఐదు సెంటర్లన్లు మూసి సైబర్‌నేరగాళ్లు పారిపోయినట్లు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు.