తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 19: వాస్తవిక సామాజిక సమస్యలపై స్పందించి నాళేశ్వరం శంకరం మంచి కవిత్వం రాశారని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రశంసించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో కొనసాగు తున్న పరిణతవాణి ప్రసంగం కార్యక్రమం శనివారం కొనసాగింది. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరి గిన ఈ సభలో ప్రముఖ కవి డాక్టర్ నాళేశ్వరం శంకరం పాల్గొని 95వ పరిణతవాణి ప్రసంగం చేశారు. “భిక్షాట న వృత్తి జీవనోపాధిగా ఉన్న వర్గంలో జన్మించాను. వృత్తి నిర్వహణలో భాగంగా శవం ముందు శంఖం ఊదేపని కూడా చేశాను. భిన్నమైన కవిగా రూపొం దడానికి అనేక కారణాలు ఉన్నాయి. భిన్నమైన స్వభా వంతో రాసిన కవిత్వంలోనే ప్రత్యేకత ఉంది. తెలంగా ణ మలి దశ ఉద్యమంలో తెలంగాణ రచయితల వేదిక నిర్వహించిన క్రియాశీలక సాంస్కృతికోద్యమంలో నా వంతు పాత్ర పోషించాను. సోయి ఉద్యమ పత్రికకు సంపాదక బాధ్యత నిర్వహించాను. నా గురువు సినారె తో గల పరిచయంతో ఆయన వాత్సల్యం చూరగొన్నా ను. కాలమిస్టుగా, పత్రికలు నడిపిన అనుభవం ఉంది. విధ్వంసమవుతున్న మానవ విలువలు, సామాజిక విలువలు, ప్రపంచీకరణ, వ్యవసాయం వంటి అంశా లతో కవితా వస్తువులుగా మార్చుకుని ముందుకు సాగుతున్నాను” అని డాక్టర్ నాళేశ్వరం పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పరిణతవాణిలో భాగంగా ప్రము ఖ కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య 96వ ప్రసంగ కార్య క్రమం కొనసాగుతుందని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య తెలిపారు.