కీసర, జూలై 7 : వ్యాపార లైసెన్స్ తీసుకున్న దుకాణాదారులు హరితహారం గ్రీన్ ఫండ్ కింద రూ. వెయ్యి చెల్లించాలని ఎంపీవో మంగతయారు తెలిపారు. అంకిరెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయంలో ఓ వ్యక్తి వ్యాపారం కోసం గురువారం లైసెన్స్ ఫీజు చెల్లించారు. దీంతో పాటు అదనంగా హరితహారం గ్రీన్ ఫండ్ కింద వెయ్యి రూపాయలు కట్టారు.
ఈ సందర్భంగా ఎంపీవో మంగతాయారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ పరిధిలో దుకాణాదారులు వ్యాపారం కోసం లైసెన్స్ తీసుకున్నవారందరికి హరితహారం గ్రీన్ ఫండ్ కింద రూ.1000 వసూలు చేసి పంచాయతీ ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు అన్ని గ్రామాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి శివకుమార్ పాల్గొన్నారు.