అమీర్‌పేట్, ఫిబ్రవరి 24 : సనత్‌నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాలలోని ఎన్ఎస్ఎస్ వి భాగం వారు వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం లో డీన్ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.కె.పాల్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్‌కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖి, కమ్యూనిటీ మెడిసిన్ హెచ్‌వోడీ డాక్టర్ కట్కూరి సుష్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధా బాల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలి రోజు కార్యక్రమాన్ని సనత్‌నగర్‌లోని ప్రభుత్వ రౌండ్‌టేబుల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు పాఠశాలకు చెందిన 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ‘కొవిడ్ కారణంగా నెలకొన్న పరిస్థితులు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించినట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాబాల తెలిపారు.