సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని, ఆదివారం ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడమే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఊహించిన దాని కంటే గొప్పగా బీఆర్ఎస్ పార్టీ సభ జరిగిందన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
చిరస్థాయిగా నిలిచేలా
Kp Vivekananda Goud
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 28: తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి వేలాది సంఖ్యలో తరలివచ్చి సభను ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ధన్యవాదాలు
Padmarao
సికింద్రాబాద్: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సభ విజయవంతానికి కృషి చేసిన నియోజకవర్గ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.