నేరేడ్మెట్/గౌతంనగర్/మల్కాజిగిరి, అక్టోబర్ 14 : నియోజక వర్గ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం వినాయక్‌నగర్ డివిజన్ రేణుకానగర్, కాకతీయనగర్, దీన్‌దయాళ్‌నగర్ కాలనీల్లో రూ. 90లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మితో కలిసి ప్రారంభించారు. కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, డీసీ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేశ్, ఏఈ సత్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, బద్దం పరశురాం, పిట్ల శ్రీనివాస్, జీఎన్‌వి సతీశ్‌కుమార్, గుండా నిరంజన్, సూరి, ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సంతోష్రాందాస్, చంద్రకాంత్, బాలకృష్ణ, బాలరాజు యాదవ్, పీఎస్ శ్రీనివాస్, గంగాధరి కృష్ణ, ఆగమయ్య, సందీప్‌గౌడ్, రఘుయాదవ్ పాల్గొన్నారు.
మల్కాజిగిరి : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి డివిజన్ రామబ్రహ్మనగర్, సీతారాంనగర్కాలనీలలో రూ.90లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణపనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, పార్కులను అభివృద్ధిపరుస్తామని అన్నారు. డీసీ రాజు, డీఈ మహేశ్, ఏఈ సత్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అధికార ప్రతినిధు జీఎన్వీ సతీశ్. మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, పరశురాంరెడ్డి, మోహన్‌రెడ్డి, వినయ్‌గౌడ్, సూరి, కృష్ణ, గణేశ్, గోపాల్‌సింగ్, బాలకృష్ణ, మబ్బు పాల్గొన్నారు.
గౌతంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకవచ్చారని, దేశమంతా దళిత బంధు అమలు కావాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. దళిత బంధు పథకం కింద చందాబాగ్కు చెందిన మద్దూరి దుర్గేశ్ శశికళ దంపతులు రూ.10లక్షలతో ఏర్పాటు చేసిన తెలంగాణ కిరాణ జనరల్ స్టోర్‌ను చందాబాగ్లో శుక్రవారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు. టీఆర్ఎస్ నాయకులు జీఎన్వీ సతీశ్‌కుమార్, ఎం.భాగ్యనందరావు, మౌలాలి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు డి. సత్తయ్య, మంద భాస్కర్, ఆదినారాయణ, సంతోష్ రాందాస్, ఎస్కే. బాబా, గౌలికర్ శైలేందర్, ఇబ్రహీం, చందు, షకీల్, సంతోష్‌గుప్తా, సత్త య్య, జంగయ్య పాల్గొన్నారు.
వర్షాలకు కూలిపోయిన ఇండ్లకు ప్రభుత్వ పరంగా నష్ట పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ఇండ్ల కట్టుకునేందుకు రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నా రు. ఇటీవల కురిసన వర్షాలకు మౌలాలి డివిజన్ చందాబాగ్లో మంద కృష్ణ ఇల్లు కూలిపోయింది. ఎమ్మెల్యే మంద కృష్ణ ఇంటిని పరిశీలించారు. చందాబాగ్లో శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు 30వరకు ఉంటాయని బస్తీవాసులు ఎమ్మెల్యేకు వివరించారు. తాసీల్దార్ వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి శిథిలావస్థలో ఉన్న ఇండ్లను పరిశీలించి కూలిపోయిన ఇండ్లను సర్వే చేయాలని కోరారు.
రుక్మిణీకృష్ణ నివాసం ఉంటున్న కూలిన ఇంటిని పరిశీలించి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు. తనకు పెండ్లికి ఇద్దరు కూతుర్లు ఉన్నారని తన కుటుంబ పరిస్థితి బాగులేదని ఎమ్మెల్యేకు వివరించారు. కూతురు పెండ్లికి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, ఆదేవిధంగా దళిత బంధు పథకం కింద రూ.10లక్షలను అందిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి భరో సా కల్పించారు. నాయకులు జీఎన్వీ. సతీశ్‌కుమార్, ఎం. భాగ్యనందరావు, డి. సత్తయ్య, మంద భాస్కర్, మద్దూరి దుర్గేశ్, ఇబ్రహీం, షకీల్ శైలేందర్, కాశీనాథ్‌యాదవ్, జంగయ్యముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.