మహేశ్వరం, ఫిబ్రవరి 24: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధికి 29.65 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం అమోదించిందని దానిని వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం వినియోగించుకోవాలని ఆయన మున్సిపాలిటీ పాలక మండలి సభ్యులను కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కంపెనీలలో పనులు చేసేందుకు స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని పాలక మండలి సభ్యులు అడిషనల్ కలెక్టర్‌ను కోరారు. తుక్కుగూడలో ఎరుకల కులస్తులకు పందుల పెంపకానికి స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కాంటెకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్‌రెడ్డి కమిషనర్ జ్ఞానేశ్వర్, మేనేజర్ పర్వతాలు కౌన్సిలర్లు బోధ యాదగిరిరెడ్డి, అనిత జయరాజు, శివకుమార్, మౌనిక మహేందర్, బూడిద తేజస్విని శ్రీకాంత్‌గౌడ్, బాకీ విలాస్, సుమన్, భావన సుధాకర్, సప్పిడి లావణ్య రాజు ముదిరాజ్, రాజమోని రాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.