-జలమండలి అధికారిని కోరిన కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్
గోల్నాక/కాచిగూడ, ఫిబ్రవరి 24: పలు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసున్న మంచినీటి పైపులైన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్ కోరారు.గురువారం నారాయణగూడలోని జలమండలి కార్యాలయంలో జనరల్ మేనేజర్ సుబ్బారాయుడిని ఆమె కలిసి వినతి పత్రం అందజేశారు. గోల్నాక డివిజన్లోని నింబోలిఅడ్డ సంఘం హోటల్ నుంచి గోల్నాక బ్రిడ్జి వరకు కొత్తగా ఏర్పాటు చేస్తున్న 300 ఎంఎం మంచినీటి పైపులైన్ల పనుల్లో జాప్యం జరుగుతోందని ఆమె తెలిపారు. నింబోలిఅడ్డ, నెహ్రూనగర్, సుందర్‌నగర్, నవాబ్బాడా, కృష్ణానగర్, న్యూకృష్ణానగర్, అడ్డీ ఖార్ఖానా, శాంనగర్, శాస్త్రి నగర్ తదితర ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వెంటనే కొత్తగా ఏర్పాటు చేసిన పైపులైన్లకు వెంటనే కనెక్షన్లు ఇచ్చి మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆమె కోరారు.
అంతే కాకుండా అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా మంచినీటి, మురుగునీటి పైప్లైన్లు పగిలి పోయి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని అమె తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, నర్సింగ్‌రావు తదితరులున్నారు.