తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 18: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తన తండ్రి సుద్దాల హనుమంతుని కుమారునిగానే సాహిత్య వారసత్వంలో రాణిస్తున్నానని ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నా రు. చిన్నప్పటి నుంచే పాటలు రాయడం, పాడ టం అలవోకగా అబ్బి ఆయన వారసత్వాన్ని పుణి కి పుచ్చుకొని సాహిత్యంలో ముందుకు సాగుతున్నాయని అశోక్ తేజ పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిణతవాణి ప్రసంగ పరంపరలో భాగంగా శుక్రవారం సుద్దాల అశోక్ తేజ పాల్గొని బాల్యం, సాహిత్య జీవితం, తదితర అంశాలపై లోతైన విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. “నిజానికి మా ఇంటి పేరు గుర్రం వారు, గ్రామం సుద్దాల కావడంతో ఇంటి పేరుగా మారింది. 1989లో మొట్ట మొదటగా ‘నమస్తే అన్న’ చిత్రానికి పాట రాశాను, అనంతర కాలంలో ‘ఒసేయ్.. రాములమ్మ’ చిత్రానికి ఏడు పాటలు రాయడంతో అపారమైన ఖ్యాతి వచ్చిం ది. సినారె పాటలు వింటూ ఎప్పటికైనా తెర మీద సినారె పేరు కింద నా పేరు చూసుకోవాలని తపించాను. తుదకు అది నెరవేరింది. ప్రాథమిక విద్యార్జన దశలోనే నాన్న నేర్పిన ‘శ్రీశ్రీ మహా ప్రస్థానం’ గేయాలు మొత్తం కంఠస్థంగా వచ్చాయి. 1600 సినిమాలకు 2600 పాటలు పాటలు రా శాను.
“కటుకూరి రామచంద్రారెడ్డి స్మృతి గీతం, వెలుగు రేఖలు నవల, బతుకు పాటలు, నేను అడవిని మాట్లాడుతున్నాను, ఆకుపచ్చ చందమా మ, నేలమ్మ నేలమ్మ” గ్రంథాలు వెలువరించా ను. ‘వీర తెలంగాణ’ సాంఘిక యక్షగానం రచించాను. ‘నేలమ్మ నేలమ్మ’ గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గేయ రచన పురస్కారాన్ని అందించింది. ‘ఠాగూర్’ చిత్రంలోని ‘నేను సై తం..’ అనే గీతానికి జాతీయ పురస్కారం లభించింది. గీతం విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. విశ్వాసానికి మించిన ఈశ్వరుడు లేడని, తపనకు మించిన తపస్సు లేదనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తాను. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై మరణం అంచుల దాకా వెళ్ళాను. నా కుమారుడు కాలేయ దానం చేయటంతో పునర్జన్మ లభించింది” అని అశోక్ తేజ చెప్పారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ సుద్దాల అశోక్ తేజ రచించిన గీతాలు బ హుళ ప్రజాదరణ పొందాయని ప్రశంసించారు. శనివారం ఇదే వేదికపై ‘ప్రముఖ కవి డాక్టర్ నాళేశ్వరం శంకరం’ ప్రసంగం చేస్తారని వెల్లడించారు. కోశాధికారి మంత్రి రామారావుతో పాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.