డీప్ ఫేక్స్తో పెరుగుతున్నముప్పు
- ఏడాదికే 13% నేరాలు అధికం
- వీఎంవేర్, పాలోఆల్టో సర్వేలో వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు పంథా మారుస్తున్నారు. ఇప్పటికే వివిధ మార్గాల్లో సైబర్ దాడులకు పాల్పడుతున్న కేటుగాళ్లు.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని సైతం వాడుకొంటున్నారు.
‘డీప్ ఫేక్స్’గా పిలిచే ఈ తరహా నేరాలు మున్ముందు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు ప్రముఖ సైబర్ సెక్యురిటీ కంపెనీలు వీఎంవేర్, పాలోఆల్టో తమ సర్వే నివేదికలో హెచ్చరించాయి. నిరుడు మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు నిర్వహించిన ఈ సంస్థలు ‘వీఎంవేర్ 2022 గ్లోబల్ ఇన్సిడెంట్ థ్రెట్ రెస్పాన్స్ రిపోర్టు’ పేరిట ఇటీవల ఈ నివేదికను విడుదల చేశాయి.
సైబర్ నేరాల్లో దాదాపు 70% వరకు రాన్సమ్వేర్ దాడులు, బిజినెస్ ఈ-మెయిళ్లపై దాడులు ఉన్నట్టు తేల్చాయి. నిరుటితో పోలిస్తే ఈ తరహా నేరాలు 13% పెరిగాయని వెల్లడించింది. ప్రధానంగా రాజకీయ అంశాలను ప్రభావితం చేసేందుకు దీనిని వాడుతున్నట్టు తెలిపింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) వద్ద నమోదవుతున్న కేసుల్లోనూ డీప్ ఫేక్స్, వ్యక్తిగత సమాచార చౌర్యం కేసులు ఎక్కువగా ఉంటున్నట్టు పేర్కొన్నది.
నివేదిక వివరాలు
- సైబర్ నేరాల్లో 70% రాన్సమ్వేర్ దాడులు, బిజినెస్ ఈ-మెయిళ్లపై దాడులే
- నిరుటితో పోలిస్తే 13% పెరిగిన డీప్ ఫేక్స్ నేరాలు
- వ్యక్తిగత సమాచార సేకరణకు సైబర్ నేరగాళ్లు సాఫ్ట్వేర్లోని లోపాలను ఆధారంగా చేసుకొంటున్న ఘటనలు 48%, బ్రూట్ ఫోర్స్ క్రెడెన్షియల్ ఎటాక్స్20%, పిషింగ్ ఎటాక్స్ 12%, ఇతర రకాల దాడులు 20%
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

