మాధవరం కృష్ణారావు
వ్యయంతో నిర్మిస్తున్న ఆర్వోబీ పనుల పరిశీలన
అల్లాపూర్,ఫిబ్రవరి24: కూకట్‌పల్లిలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కైత్లాపూర్ ఆర్వోబీ అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కైత్లాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు రూ.83 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను కార్పొరేటర్లు సబీహాబేగం, పగుడాల శిరీష బాబురావుతో కలిసి ఎమ్మెల్యే గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూకట్పల్లి నుంచి హైటెక్‌సిటీకి వెళ్లాలంటే వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మంత్రి కేటీఆర్ సహకారంతో ఆర్వోబీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. 90శాతం పనులు పూర్తయ్యాయని, కొన్ని కారణాలతో ఆర్వోబీ పనుల్లో జాప్యం జరిగిందన్నారు. త్వరలోనే ఆర్వోబీని అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, డివిజన్ అధ్యక్షుడు లింగాల అయిలయ్య, వీరారెడ్డి, పిల్లి తిరుపతి, పార్వతమ్మ, నాగుల సత్యం, జహెద్బాబాషరీఫ్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కాశీనాథ్చారి, రోణంకి జగన్నాథం, ఇస్మాయిల్, మస్తాన్‌రెడ్డి, యోగిరాజ పాల్గొన్నారు.