రోబోటిక్ ఫ్రేమ్ వర్క్ ఆవిష్కరణలో భాగంగా మంగళవారం టీహబ్ వేదికగా కార్యక్రమంలో సుమారు 10 రకాల రోబోలు సందడి చేశాయి. బుట్టబొమ్మ తరహాలో ఉన్న మహిళా రోబో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రోబోటిక్ ఫ్రేమ్ వర్క్ పత్రాలను మంత్రి కేటీఆర్‌తో పాటు అతిథులకు అందజేసి అందరినీ ఆకట్టుకున్నది.
సిటీబ్యూరో,మే 9 (నమస్తే తెలంగాణ): టీ హబ్ వేదికగా మంగళవారం జరిగిన రోబోటిక్ ప్రేమ్ వర్క్ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుమారు 10 రకాల రోబోలు సందడి చేశాయి. అతిథులకు ఆహ్వానం పలకడం, చేతిలో రోబో ఫ్రేమ్ వర్క్ పత్రాలను తీసుకువచ్చి ముఖ్య అతిథులకు ఇవ్వడం, ప్రముఖులు ప్రసంగించిన తర్వాత ధన్యవాదాలు తెలపడం.. ఇలా రకరకాల కార్యకలాపాలను రోబోలు చేసి అందరిని ఆకట్టుకున్నాయి.
బుట్ట బొమ్మ తరహాలో ఉన్న మహిళా రోబో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రోబోటిక్ ఫ్రేమ్ వర్క్ పత్రాలను తీసుకువచ్చి మంత్రి కేటీఆర్‌కు అందజేసింది. ఇలా రకరకాల రోబోలను ఈ సందర్భంగా వాటి తయారీ దారులు వాటితో పనులు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు.