సైదాబాద్, జూన్ 5 : చంచల్‌గూడ రోడ్డు ప్రమాద ఘటనలో తల్లి, కుమార్తెల మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధితకుటుంబ సభ్యులు కోరారు. చంచల్‌గూడ చౌరస్తాలో మంగళవారం అర్ధరాత్రి కారు బైక్‌ను ఢీ కొట్టిన ఘటనలో ఆస్మాన్‌ఘడ్ గాంధీనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ భార్య సీమా అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు కుమార్తెలు మదిహా ఫాతిమా, అయార ఫాతిమా గాయపడ్డారు. చిన్నారి ఫాతిమా ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మరణించింది.
తల్లి, కుమార్తె మరణించటంతో కుటుంబ సభ్యులు, బంధువులు, బస్తీవాసులు న్యాయం చేయాలంటూ మృతదేహంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. కారు యజమాని జయనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ సలీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని బాధ్యతారహితంగా విడిచిపెట్టారన ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ దర్యాప్తు చేస్తున్నారు.