ఎమ్మెల్యే ముఠా గోపాల్
10 మంది ఆశవర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేత
కవాడిగూడ, ఫిబ్రవరి 24: ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఆశ వర్కర్లకు జారీ చేసిన స్మార్ట్ ఫోన్లు ఎంతో దోహదపడుతాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం భోలక్‌పూర్ డివిజన్లోని రంగానగర్ బస్తీ దవాఖానలో 10 మంది ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను డాక్టర్లు శృతి, రాజశ్రీ, వనిత, లక్ష్మీలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేసిన ఆశ వర్కర్ల సేవలు వెలకట్టలేనివన్నారు. వ్యాక్సినేషన్, గర్భిణులకు వైద్య పరీక్షలు, తదితర సమాచారాన్ని పొందుపరుచడానికి ఉపయోగపడుతాయని అన్నారు. ఆరోగ్య సమాచారం అంతా ఎంట్రీ అవుతుందన్నారు. ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, శ్రీనివాస్ రావు, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీనివాస్, మక్బూల్, రహీం, ఉమాకాంత్, కృష్ణ, ఇమ్రాన్ బాగ్దాది, సాయి, ప్రవీణ్, శ్రీకాంత్ యాదవ్, నర్సింగరావు, ఆరిపొద్దీన్, శ్రీధర్ రెడ్డి, గోవింద్ రాజ్, శంకర్, శివ పాల్గొన్నారు.