అంబర్‌పేట/కాచిగూడ, ఫిబ్రవరి 24: బస్తీలు, కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ప్రధానమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ తురాబ్‌నగర్‌లో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులు, కుర్మబస్తీల్లో రూ.13.60 లక్షలతో ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైపులైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా వివిధ బస్తీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి తగ్గట్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేయించానని తెలిపారు. ప్రతిపాదనలకు సంబంధించి జనరల్ బడ్జెట్ నుంచి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. గత వారం రోజులుగా నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, అంబర్‌పేట డివిజన్లలో నిరాటంకంగా అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే పోచమ్మబస్తీ, కుర్మబస్తీల్లో పాదయాత్ర నిర్వహించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, జలమండలి డీజీఎం సతీష్, మేనేజర్ మాజిద్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, పార్టీ నాయకులు అఫ్రోజ్పటేల్, శ్రీరాములుముదిరాజ్, ఇ.ఎస్.ధనుంజయ, కెంచె మహేష్, మిర్యాల రవీందర్, నవీన్‌యాదవ్, రాజేష్, శివాజీయాదవ్, సంతోష్, యోబు, నర్సింగ్, శ్రీకాంత్, బొట్టు శ్రీను, సాయిరాం, బీజేపీ నాయకులు సి.కృష్ణాగౌడ్, అజయ్‌కుమార్, చుక్క జగన్, జె.బాల్‌రాజ్, కె.సురేష్, అచ్చిని రమేష్, అచ్చిని మహేష్ పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని, పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించి ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిసామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్ చెప్పల్‌బజార్, హరిమజీద్ లైన్లో రూ.8లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ పనులను కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రధాన సమస్యగా మురుగు ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
కార్యక్రమంలో మాజీ ప్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర బీష్మాదేవ్, ఇన్చార్జి డాక్టర్ శిరీషాయాదవ్, దాత్రిక్ నాగేందర్బాబ్జి,కన్నె రమేశ్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్,సునీల్బిడ్లాన్, ఓం ప్రకాశ్‌యాదవ్, బి.కృష్టాగౌడ్, విజితారెడ్డి, మన్నె శ్రీనివాస్‌యాదవ్,ఎల్.రమేశ్, శ్రీకాంత్‌యాదవ్, జలమండలి డీజీఎం సన్యాసిరావు, మేనేజర్ భావన, డీఈ సువర్ణ, సంపత్, సంతోశ్‌కుమార్, రమాదేవి, బబ్లూ, అంటోని, సుభాశ్పటేల్, మల్లికార్జున్, క్షీర్సాగర్, తదితరులు పాల్గొన్నారు.