Rahu Transit | రాహువునేడు (మే 18న) కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ ఏడాది కీలకమైన మూడు గ్రహాలు శని, గురువు, రాహువు ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి సంచరించబోతున్నారు. శని మార్చి 29న కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి, బృహస్పతి మే 14న మిథున రాశిలోకి ప్రవేశించాడు. తాజాగా ఛాయాగ్రహంగా భావించే రాహువు మే 18న, ఆదివారం శనైశ్చరుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. రాహువు కుంభరాశిలోకి ప్రవేశించడంతో శుభ, అశుభ ప్రభావాలు 12 రాశిచక్రాలపై కనిపిస్తాయి. రాహువు రాశిచక్ర మార్పు కొన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అయితే, మరికొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మే 18న రాహువు సంచారం కారణంగా కర్కాటక, సింహ, కన్య రాశుల జాతకుల జీవితాల్లో ఎలాంటి మార్పులు జరుగనున్నాయో తెలుసుకుందాం..!
కుంభరాశిలో రాహువు సంచారం కర్కాటక రాశి వారికి ఇబ్బందికరంగా ఉండనున్నది. రాహువు సంచారం కారణంగా శుభం కంటే అశుభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాహువు సంచారం మీ రాశి నుంచి ఎనిమిదో ఇంట్ల ఉంటాడు. కాబట్టి ఆకస్మిక ఇబ్బందులు, ధననష్టం జరిగే అవకాశం ఉంది. అగౌరవపడే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మే 18న రాహువు సంచారం కర్కాటక రాశి స్థానికులకు ఎనిమిదో ఇంట ఉండడం వల్ల జీవితంలో ఏ ఆకస్మిక సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. ఎనిమిదో ఇంట ఉండే రాహువు.. పన్నెండో, నాలుగు, రెండో ఇంటిని చూస్తుంటాడు. కర్కాటక రాశి స్థానికులకు రాహువు సంచారంతో కొన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు భారీగా ఖర్చు అవుతుంది. పూర్వీకుల ఆస్తిపై వివాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
మే 18న రాహువు కుంభ రాశి వారికి కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఏడవ ఇంట్లోకి రాహువు రావడం వివాహ జీవితంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. జాతకంలో ఏడవ ఇల్లు జీవిత భాగస్వామి, భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఏడవ ఇంట్లోకి రాహువు ఉండడం వల్ల వివాహిత జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు, తగాదాలు పడే ప్రమాదం ఉంటుంది. గౌరవం మర్యాదలు తగ్గే అవకాశం ఉంటుంది. ఏడవ ఇంట్లో రాహువు సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వివాహ జీవితంలో ఇబ్బందులు ఉండవచ్చు. వ్యాపారం విస్తరించేందుకు అవకాశం ఉంది. స్నేహితులు మీకు సహకారం అందిస్తారు. అలాగే, ఆస్తులకు సంబంధించి తోబుట్టువులతో ఏదైనా వివాదం ఉంటే.. పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
మే 18న కుంభరాశిలో రాహువు సంచారం కన్య రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండనున్నది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అసంపూర్ణంగా మిగిలిన పనులన్నీ పూర్తవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. తిషశాస్త్రం ప్రకారం.. ఆరవ ఇంట్లో రాహువు ఉండడం చాలా శుభపద్రం. ఆ ఇంటిని వ్యాధులు, అప్పులు, శత్రువులుగా పరిగణిస్తారు. రాహువు ఐదో ఇంటిలో నుంచి పది, 12 ఇంటిని చూస్తుంటాడు. రాహు సంచారం ఈ రాశివారికి శుభపద్రంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.