Lunar Eclipse | నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణానికి జ్యోతిషశాస్త్రం పరంగా ప్రత్యేకత ఉన్నది. ఈ ఏడాది ఆఖరి చంద్రగ్రహణం ఇదే. భారత్ సహా చాలా దేశాల్లో కనిపించనున్నది. గ్రహణంతో కొన్ని అశుభ యోగాలు ఏర్పడనున్నాయి. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు-రాహువు ఇప్పటికే ఉన్న కుంభరాశిలో ఉంటాడు. ఈ క్రమంలో రాహువు, చంద్రుల సంయోగం గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తున్నది. మరోవైపు సూర్యుడు, కేతువుల సంయోగం కన్యారాశిలో ఉంటుంది. చంద్రుడు-రాహువు ఏడవ ఇంట్లో ఉండగా.. ఈ గ్రహాలు ఒకదానికొకటి ప్రత్యక్ష దృష్టి పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి కష్ట సమయంగా పండితులు చెబుతున్నారు. అలాగే, దీని ప్రభావం వ్యక్తిగత జీవితంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కొండలు, సున్నిత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంటుందని పండితులు చెంబుతున్నారు. ఈ గ్రహణంతో ఐదు రాశులవారికి సవాల్‌గా మారనున్నది. ఈ రాశులు ఏవో చూసేద్దాం..!
ఈ చంద్రగ్రహణం సమయంలో వృషభ రాశి వారు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పాత వ్యాధులు తిరగబెట్టే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే, ఖర్చులు సైతం అసాధారణంగా పెరుగుతాయి. తద్వారా మానసిక స్థితిని ప్రభావం చేసే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ఆర్థిక ఒత్తిడిని పెంచడంతో పాటు పనుల్లోనే అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. తద్వారా రోజువారీ పనుల్లో ఇబ్బందులు కలిగిస్తుంది.
ఈ రాశివారు ఈ సమయంలో తమ పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులపడుతారు. ఈ సమస్యలు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కుటుంబ సభ్యులతో సమన్వయం బలహీనపడుతుంది. దాంతో మానసికంగా ఒంటరివారైనట్లుగా అనిపిస్తుంది. పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీ ఉన్నతాధికారులు మీ పనిపై ఏమాత్రం నిరాశను వ్యక్తం చేస్తారు. దాంతో మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది.
చంద్ర గ్రహణం తర్వాత కుటుంబం, వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు కొంత ఉద్రిక్తంగా మారుతాయి. ఇది తగాదాలు, అపార్థాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభించకపోవడంతో నిరాశ పడుతారు. ఇతర కుటుంబ సభ్యులతో సమన్వయం దెబ్బతింటుంది. ఈ సమయంలో ఓపికగా, అవగాహనతో పనులు చేయాలి.
తులారాశి వారికి ఈ సమయం గజిబిజీగా ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. పనిలో జాప్యం జరుగుతుంది. అంతరాయాలు ఉండవచ్చు. ఒకేసారి అనేక బాధ్యతలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి. వ్యాపారవేత్తలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సన్నిహితులు కూడా మీకు వ్యతిరేకంగా కుట్ర చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ బలహీనతను ఎవరూ ఉపయోగించుకోకుండా మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచడం మంచిది.
కుంభరాశిలో చంద్రగ్రహణం జరగబోతోంది. ఈ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం పెరగవచ్చు. శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే అవకాశం ఉంది. ఇది మీ కెరీర్లో గందరగోళానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఈ సమయం ఉద్యోగస్తులకు సవాలుగా ఉంటుంది. మీరు మాటల్లో సంయమనం పాటించాలి. చుట్టుపక్కల పరిస్థితులను గమనించాలి. తద్వారా పెద్ద నష్టాలను నివారించే అవకాశం ఉంటుంది.
Read Also :
“Astrology | ఒకేరాశిలోకి కుజుడు, సూర్యుడు, బుధుడు..! ఈ మూడు రాశులవారికి అదృష్టమే అదృష్టం..!”