Astrology | వేద జ్యోతిషశాస్త్రంలో కాలానుగుణంగా గ్రహాల సంచారం అనేక యోగాలను తీసుకురానున్నాయి. ఒక రాశి నుంచి మరొక రాశికి గ్రహాల సంచారం త్రిగ్రహి, చతుర్గ్రాహి యోగాలను ఏర్పడనున్నాయి. అక్టోబర్లో కుజుడు, సూర్యుడు, బుధుడు మూడుగ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉంటాయి. ఇది త్రిగ్రహి యోగం ఏర్పడనున్నది. అక్టోబర్ 13న కుజుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడని, అక్టోబర్ 3న బుధుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. తులారాశిలో కుజుడు, బుధుడు, సూర్యుడి గొప్ప సంయోగంతో తులారాశిలో మూడు ప్రధాన గ్రహాల సంయోగం కారణంగా.. కొన్ని రాశుల అదృష్టంలో పెద్ద మార్పు కనిపించనున్నది. ఆర్థిక లాభం, పనిలో విజయం సాధించే అవకాశాలు బాగా ఉంటాయి. అదృష్ట రాశుల వారెవరో తెలుసుకుందాం..!
త్రిగ్రహి యోగంతో కర్కాటక రాశివారికి చాలా శుభప్రదం, సానుకూల ఫలితాలను ఇవ్వనున్నాయి. ఈ యోగం కర్కాటక రాశి నుంచి నాల్గవ స్థానంలో ఏర్పడుతుంది. ఈ కారణంగా మీరు అన్ని రకాల భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందే అవకాశాలున్నాయి. ఇతర మంచి అవకాశాలు కూడా అందుకుటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆస్తికి సంబంధించిన పనులు చేసే వ్యక్తులతో మంచి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడుతాయి.
అక్టోబర్ నెలలో తులారాశి వారికి సూర్యుడు, బుధుడు, కుజుడు కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దాంతో మీ గౌరవం, విశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మీకు ప్రజాదరణ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు కార్యాలయంలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఎవరితోనైనా ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి సంబంధం మరింతగా పెరుగుతుంది. వివాహితుల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
వృశ్చిక వారికి త్రిగ్రహి యోగం చాలా ప్రయోజనకరంగా, శుభప్రదంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ యోగం మీ రాశిచక్రంలోని రెండవ ఇంట్లో అంటే సంపద స్థానంలో ఏర్పడుతుంది. మీకు ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త ఉద్యోగం కోసం అనేక అద్భుతమైన అవకాశాలు పొందే అవకాశం ఉంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది. ఈ సమయంలో కళ, సంస్కృతిపై ఆసక్తిపై పెరుగుతుంది.