Kids Health | పిల్లలకు ఆ వయస్సు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు అయ్యేలా నేర్పించాలి.. ఎందుకంటే..
బాల్యంలో అలవాటు అయ్యే జీవనశైలి, వ్యక్తి భవిష్యత్ ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. చిన్నతనంలో నేర్చుకున్న ఆహారపు అలవాట్లు, నిద్ర విధానం, శారీరక చురుకుదనం, రోజువారీ క్రమశిక్షణ వంటి అంశాలు పెద్దయ్యాక కూడా కొనసాగుతాయి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటల కంటే వారు చేసే పనుల నుంచే ఎక్కువగా నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
Kids Health | బాల్యంలో అలవాటు అయ్యే జీవనశైలి, వ్యక్తి భవిష్యత్ ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. చిన్నతనంలో నేర్చుకున్న ఆహారపు అలవాట్లు, నిద్ర విధానం, శారీరక చురుకుదనం, రోజువారీ క్రమశిక్షణ వంటి అంశాలు పెద్దయ్యాక కూడా కొనసాగుతాయి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటల కంటే వారు చేసే పనుల నుంచే ఎక్కువగా నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అందుకే చిన్న వయసులోనే ఆరోగ్యకరమైన అలవాట్లను కుటుంబంలో భాగం చేయడం పిల్లల దీర్ఘకాల ఆరోగ్యానికి పెట్టుబడిగా భావించవచ్చు. పిల్లలకు చిన్న వయసులోనే ఈ-సిగరెట్లు (వేప్స్) వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని నేర్పించడం చాలా అవసరం. ప్రస్తుతం యువతలో వేపింగ్ వినియోగం పెరుగుతున్నప్పటికీ, అవి సురక్షితమైనవి అనే అభిప్రాయం తప్పుదారి పట్టించేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
డిజిటల్ తెరలకు దూరంగా..
ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలు కాస్త ఖాళీగా ఉన్నా వెంటనే మొబైల్, టాబ్లెట్ లేదా ఇతర స్క్రీన్లను ఆశ్రయించడం సాధారణమైంది. అయితే అప్పుడప్పుడు బోర్గా అనిపించడం కూడా అవసరమేనని నిపుణులు సూచిస్తున్నారు. ప్రశాంతంగా తమ ఆలోచనలతో కొంత సమయం గడపడం వల్ల సృజనాత్మకత పెరుగుతుందని, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. నిరంతరం స్క్రీన్లతో గడపడం వల్ల నిశ్శబ్దాన్ని ఆస్వాదించే సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఆహారపు అలవాట్లు పిల్లలకు ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో చూసి నేర్చుకునే అంశాల్లో ఒకటి. కుటుంబ సభ్యులు ఏం తింటారు, ఎలా తింటారు, భోజన సమయంలో ఎలా వ్యవహరిస్తారు అనే విషయాలన్నీ పిల్లలపై ప్రభావం చూపుతాయి. అందుకే ఇంట్లోనే సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం వంటి మంచి అలవాట్లను అందరూ పాటించడం అవసరమని సూచిస్తున్నారు.
చురుగ్గా ఉండేలా వ్యాయామం లేదా ఆటలు..
ప్రతి రోజూ శారీరకంగా చురుకుగా ఉండే అలవాటు పిల్లలకు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నడక, ఆటలు, క్రీడలు లేదా స్వేచ్ఛగా ఆడుకోవడం వంటి ఏ రూపంలోనైనా ప్రతిరోజూ శరీరాన్ని కదిలించడం ముఖ్యమని పేర్కొంటున్నారు. ఏ వ్యాయామం చేశామన్నది కంటే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయడం వల్లే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. నాణ్యమైన నిద్ర కూడా పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర సమయంలోనే మెదడు నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకుంటుంది, భావోద్వేగాలను నియంత్రిస్తుంది, శరీర ఎదుగుదలకు అవసరమైన ప్రక్రియలు జరుగుతాయి. అలాగే జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి కూడా తగిన నిద్ర అవసరం. అందువల్ల చిన్నప్పటి నుంచే సమయానికి నిద్రపోయే అలవాటును పెంపొందించడం పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

