Yoga | మాతృయోగ మార్జరి ఆసనం

యోగాలో ఒక్కో ఆసనం ఒక్కో శరీర భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి, మార్జరి ఆసనం మెడ కండరాల నుంచి నడుం వరకు సత్తువనిస్తుంది. అయితే, నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ఆసనాన్ని ప్రయత్నించాలి.
- ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. గాలి తీసుకుంటూ మోకాళ్ల మీద కూర్చోవాలి. నడుం పైభాగాన్ని
- నిటారుగా ఉంచాలి.
- శ్వాస వదులుతూ ముందుకు వంగి, రెండు చేతులను నేలకు ఆనించాలి. మోకాళ్లు, చేతులు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. పొట్ట
- భూతలానికి సమాంతరంగా ఉండాలి.
- ఎ. ఊపిరి పీలుస్తూ తల పైకి ఎత్తాలి. మెడ కండరాలను స్ట్రెచ్ చేయాలి. వీపును బల్లపరుపుగా ఉంచి,నిదానంగా పైకెత్తాలి.
- ఈ పొజిషన్లో నాలుగైదుసార్లు శ్వాసక్రియ కొనసాగించాలి.
- బి. నడుమును కాస్త కిందికి స్ట్రెచ్ చేసే ప్రయత్నం చేయాలి. తల కిందికి దించి శ్వాస తీసుకుంటూ పొత్తికడుపును చూసే ప్రయత్నం చేయాలి. ఈ పొజిషన్లో నాలుగైదు సార్లు శ్వాసక్రియ కొన
- సాగించాలి.
- పైన పేర్కొన్న ఎ, బి ప్రక్రియలు ఒకదాని తర్వాత ఒకటి నాలుగుసార్లు చేయాలి. చివరగా నిదానంగా వజ్రాసన స్థితిలోకి రావాలి.
- తల పైకి ఉన్నప్పుడు దృష్టిని పై దిశలో ఉంచాలి. కిందికి ఉన్నప్పుడు పొత్తికడుపుపై దృష్టి సారించాలి.
ప్రయోజనాలు: పొత్తికడుపు కండరాలు దృఢంగా తయారవుతాయి. వెన్నెముక బలంగా ఉంటుంది. మెడ కండరాలు సత్తువను సంతరించుకుంటాయి. నడుం నొప్పులు తగ్గుతాయి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- pregna
- Pregnant Woman
- Yoga
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

