Yoga Asanas For Thyroid | మన శరీరంలో గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయడంలో, శరీర అవసరాలకు తగినట్టు శక్తిని విడుదల చేయడంలో, కణజాలాల అభివృద్దికి, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, ఎముకలను బలంగా చేయడంలో, నాడీ వ్యవస్థ పనితీరును పెంచడంలో, శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో ఇలా అనేక విధులను థైరాయిడ్ హార్మోన్ నిర్వర్తిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ థైరాయిడ్ బారిన పడుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా శరీరంలో ఐయోడిన్ లోపం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
తలతిరగడం, వేగంగా బరువు పెరగడం, కండరాల బలహీనత, చేతులు తిమ్మిర్లు రావడం, ఆందోళన, డిప్రెషన్, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు వంటి వాటిని థైరాయిడ్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం థైరాయిడ్ కి సంబంధించిన మందులు వాడాల్సిందే. ఇక మందులను వాడడంతో పాటు తీసుకునే ఆహారాల్లో మార్పులు చేసుకోవడం, చక్కటి జీవన విధానాన్ని పాటించడం వంటివి చేయాలి. వీటితో పాటు రోజూ కొన్ని రకాల ఆసనాలు వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు పెరుగుతుంది. థైరాయిడ్ వల్ల కలిగే దుష్పభ్రావాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనాలు వేయడం వల్ల థైరాయిడ్ వ్యాధికి వాడే మందుల మోతాదును కూడా తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచే ఆసనాల గురించి యోగా నిపుణులు వివరిస్తున్నారు.
తల, భుజాలు నేలపై ఉంచి నడుము, కాళ్లు పైకెత్తి వేసే ఈ ఆసనం వల్ల థైరాయిడ్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథికి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. హైపోథైరాయిడిజం నుండి ఉపశమనం కలుగుతుంది. విపరీత కరణి ఆసనం.. తల, నడుము నేలపై సమాంతరంగా ఉంచి కాళ్లను నిటారుగా గోడకు ఆనించి వేసే ఈ ఆసనం శరీరానికి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల నిద్రలేమి తగ్గుతుంది. హైపోథైరాయిడిజం నిర్వహణలో కూడా ఈ ఆసనం ఎంతో మద్దతును ఇస్తుంది. సేతు బంధాసనం.. తల, భుజాలు, కాలి వేళ్లు నేలపై ఉంచి నడుము, కాలి తొడలు పైకెత్తి వేసే ఈ ఆసనం కండరాలను బలపరుస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథికి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు పెరుగుతుంది.
తల, భుజాలు నేలపై ఉంచి నడుముతో పాటు కాళ్లను కూడా తలపై నుండి వంచి వేసే ఈ ఆసనం హైపోథైరాయిడిజంతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. అయితే హైపర్ థైరాయిడ్ ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకపోవడమే మంచిది. శవాసనం.. నేలపై నిటారుగా పడుకుని వేసే ఈ ఆసనం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. ఈ ఆసనం వల్ల మొత్తం థైరాయిడ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. హైపోథైరాయిడిజం నుండి ఉపశమనానికి కూడా ఈ ఆసనం సహాయపడుతుంది.
ప్రతిరోజూ ఈ ఆసనాలను వేయడం వల్ల థైరాయిడ్ తో బాధపడే వారికి ఎంతో మేలు కలుగుతుంది. థైరాయిడ్ లక్షణాలు తగ్గడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.