World Health Day | ఈ ఐదింటిని రెగ్యులర్‌గా పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమే
World Health Day 2022 | తిండికి కొదువ లేదు. కానీ, ఆహారంలో పోషకాల్లేవు. టెక్నాలజీ పుణ్యమాని కమ్యూనికేషన్ల వ్యవస్థ మెరుగుపడింది. అయినా, ఆత్మీయులతో గడిపే తీరిక లేదు. ఇంటి నిండా సౌకర్యాలే. గుండెల్లో మాత్రం ఏదో వెలితి. మొత్తానికి మనిషి దారి తప్పాడు. ఆ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అయినా మించిపోయింది లేదు. ఆ తిరోగమన చక్రాన్ని ఆపేయవచ్చు. పరిపూర్ణ ఆరోగ్యం దిశగా అడుగులు వేయవచ్చు. శతమానం భవతి.. అనిపించుకోవచ్చు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఇక నుంచి అయినా ఆహారాన్ని ప్రేమించడం మానేసి, శరీరాన్ని ప్రేమించడం ఆరంభిద్దాం.

పరిపూర్ణ ఆహారం
మానవ శరీరంలోని కోట్లకొద్ది కణాలకు పోషణ అవసరం. ఆహారం ద్వారా వాటికి ఆ శక్తి అందుతుంది. అయితే మనం తీసుకునే ఆహారంలో ఏ మేరకు ఆరోగ్యకర పదార్థాలు ఉన్నాయన్నది గమనించుకోవాలి. గత శతాబ్దం నుంచీ మన ఆహార పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. చిరుతిళ్ల తయారీదారులు అమ్మకాలు పెంచుకునేందుకు ఆహారంలోంచి పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లను తీసేయడం మొదలుపెట్టారు. అలాగే చక్కెర, ఉప్పు వాడకాన్ని పెంచేశారు. ఈ రెండూ ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. ఆ దెబ్బతో వయసుతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఏ పదార్థమైనా వేయించుకుని కాకుండా ఉడికించుకుని తినాలి.
కొన్ని హెచ్చరికలు..
♥ కోడి, మేక మాంసానికి దూరంగా ఉండాలి.
♥ శుద్ధి చేసిన చక్కెర, పిండి, నూనెలను వాడకూడదు.
♥ నిల్వ పదార్థాలు ముట్టుకోవద్దు.

శారీరక శ్రమ
శరీరం ఎంత శ్రమిస్తే, మనిషికి అంత ఆరోగ్యం. ఎంత కదలకుండా ఉంటే, అన్ని కొత్త రోగాలు. మంచి జీవనశైలికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. వాస్తవానికి శోషరస నాళ వ్యవస్థ శరీరానికి కాపలాదారుగా ఉంటుంది. రోజువారీ వ్యాయామం దీని పనితీరును మెరుగుపరుస్తుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు మొదలు ప్రాణాంతక క్యాన్సర్ల వరకు పలు రుగ్మతలను నివారిస్తుంది. వ్యాయామం ఎముకలు, కండరాలను దృఢం చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువుకు శారీరక శ్రమ తప్పనిసరి. అలాగే గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం, పలు క్యాన్సర్ల నివారణకు వ్యాయామం ఔషధంలా పనిచేస్తుంది. కసరత్తు శారీరక సమస్యలనే కాదు, మానసిక రుగ్మతలనూ దూరం చేస్తుంది. ఒత్తిడి, నిద్రలేమికి చక్కని పరిష్కారం కూడా. శారీరకంగా శ్రమించాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన పనిలేదు. నడక, సైక్లింగ్, డ్యాన్స్, యోగా, మైదానంలో ఆడే ఆటలన్నీ.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి, చెమటలు చిందిస్తాయి.

వ్యర్థాలకు విముక్తి
మనిషి ఏడాది పొడవునా.. రోజుకు నాలుగైదుసార్లు ఆహారం తీసుకుంటూనే ఉంటాడు. ఆ ప్రక్రియలో శరీరంలో వ్యర్థాలు, మలినాలు తయారవుతాయి. వాటిని సేకరించి విసర్జించడం ఎంతో అవసరం. మనం రాత్రిళ్లు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడు మెటబాలిక్ వ్యర్థాలను తొలగిస్తుంది. 2016లో నోబెల్ బహుమతి అందుకున్న పరిశోధన ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రెండు వారాలకోసారి 24 గంటలపాటు ఉపవాసం చేస్తే, శరీరంలోని వ్యర్థాలన్నీ రీసైకిల్ అవుతాయి. ఆ పద్ధతిని ‘ఆటోఫజీ’ అంటారు. అలాగే 2018లో నోబెల్ బహుమతి అందుకున్న పరిశోధన ప్రకారం పదిరోజులపాటు పాక్షిక ఉపవాసం ఉండటం, అంటే రోజుకు ఒక్కపూట మాత్రమే తినడంవల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అది కూడా ప్రొటీన్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే క్యాన్సర్‌ను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందని ఆ అధ్యయనం చెబుతున్నది. వివిధ మార్గాల ద్వారా శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు వదిలించుకుంటే పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమే.

జీవ గడియారం
భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి ఓ జీవ గడియారం ఉంటుంది. ఎంత విద్యుత్ కాంతులున్నా శరీరానికి పగలు పగలే, రాత్రి రాత్రే. శరీరం పగలు చురుకుగా ఉంటుంది. రాత్రి విశ్రాంతిని ఆశిస్తుంది. కానీ, అపసవ్య జీవనశైలి వల్ల గడియారం మొండికేస్తున్నది.
మంచి దినచర్య..
♥ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.
♥ సూర్యోదయం తర్వాత రెండు గంటల వరకూ ఏమీ తినకూడదు. సూర్యాస్తమయంలోపే రాత్రి భోజనం ముగించాలి.
♥ చీకటి పడ్డాక వ్యాయామం చేయకూడదు.
♥ రాత్రిళ్లు నీలిరంగు కిరణాలను చిమ్మే టీవీ, ఫోన్, కంప్యూటర్ చూడకూడదు.
♥ రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.

భావోద్వేగం- ఆధ్యాత్మికత
పాజిటివ్ భావోద్వేగాలు శరీరంలో వివిధ హార్మోన్ల ఉత్పత్తికి కారణం అవుతాయి. అవి మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఒత్తిడికి, అసహనానికి గురైనప్పుడు ఎంతోకొంత బాధ కలుగుతుంది. కానీ ఆ భావనలను వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి. సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని మనసును శాంతపర్చుకోవాలి. అప్పుడే, మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి. వీటితో పాటు షరతుల్లేని ప్రేమ ఎప్పుడూ మంచిదే. అలాగే భక్తితో చేసే ప్రార్థనలు, భజనలు కూడా ఆనంద హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి.
Read More :
Cancer: డబ్ల్యూహెచ్‌వో చెప్పినట్లు రోజూ ఇలా చేస్తే క్యాన్సర్‌నుంచి తప్పించుకోవచ్చు..!!”
“మిల్లెట్స్‌ను ఎవరైనా తినొచ్చా..? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి..?”
“Hygienic food: హైదరాబాద్‌లో ఆరోగ్యకరమైన అల్పాహారం..ఎక్కడ దొరుకుతుందంటే?”
“Healty Food | ఈ ఫుడ్ తింటే పదేండ్లు అధికంగా బతకొచ్చు!!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

