Persimmons | మనం ఆరోగ్యంగా ఉండేందుకు గాను పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు గాను మార్కెట్లో మనకు రకరకా పండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని రకా పండ్ల గురించి చాలా మందికి తెలియదు. పూర్వం మనం పెద్దలు ఆ పండ్లను ఎంతో ఇష్టంగా తినేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. అలాంటి పండ్లలో పర్సిమోన్ పండ్లు కూడా ఒకటి. వీటినే హిందీలో అమర్ ఫల్ అంటారు. తెలుగులో తునికి పండ్లు అంటారు. సాధారణంగా ఇవి మనకు కేవలం వేసవిలోనే లభిస్తాయి. కానీ హైబ్రిడ్ జాతికి చెందిన తునికి పండ్లను మనం సూపర్ మార్కెట్లలో ఎప్పుడంటే అప్పుడు కొనుగోలు చేయవచ్చు. ఈ పండ్లు నారింజ రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటినే అడవి సపోటా పండ్లని కూడా పిలుస్తారు. ఇక ఈ పండ్లను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
తునికి పండ్లను సూపర్ ఫుడ్‌గా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. తునికి పండ్లలో విటమిన్లు ఎ, సి, ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. తునికి పండ్లు డయాబెటిస్ ఉన్నవారికి గొప్ప వరం అనే చెప్పవచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తరచూ తింటుండాలి.
తునికి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్లు ఎ, సి ఉంటాయి. ఇవి వయస్సు మీద పడడం, చర్మంపై ముడతలు రావడాన్ని తగ్గిస్తాయి. దీంతోపాటు స్కిన్ టోన్‌ను మెరుగు పరుస్తాయి. అలాగే సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. తునికి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే బీపీని నియంత్రించవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ లేదా ఇతర గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.
తునికి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం సమస్య ఉండదు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు తగ్గుతాయి. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటారు. తునికి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. తీవ్రమైన వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇలా తునికి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ పండ్లు మీకు బయట ఎక్కడైనా కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చి తినండి.