Avocado | మార్కెట్లో మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అవకాడోలు కూడా ఒకటి. ఇవి ఎక్కువగా మనకు సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. ఇవి ధర కాస్త ఎక్కువే ఉంటాయి. కానీ ఈ పండ్లు అందించే ప్రయోజనాలు బోలెడు అనే చెప్పాలి. అవకాడోలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవకాడోలు మనకు పోషణను అందిస్తాయి. రోగాలను నయం చేస్తాయి. ఇంకా ఎన్నో లాభాలను అందిస్తాయి. అవకాడోలను నేరుగా తినవచ్చు. లేదా స్మూతీలు, సలాడ్స్ రూపంలోనూ తీసుకోవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
అవకాడోలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తినాల్సి ఉంటుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసిపోరు. అలాగే ఈ పండ్లలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా ఓలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
అవకాడోలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల అవకాడోలను తింటే సుమారుగా 7 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. షుగర్ లెవల్స్ సైతం కంట్రోల్ అవుతాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. అవకాడోలలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల అవకాడోలను తింటే సుమారుగా 485 మిల్లీగ్రాముల మేర పొటాషియం లభిస్తుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. నాడులు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీంతో కాలి పిక్కలు పట్టుకుపోకుండా చూడవచ్చు. నొప్పులు కూడా తగ్గుతాయి.
ఒక మీడియం సైజు అవకాడోను తినడం వల్ల విటమిన్ కె సమృద్ధిగా లభిస్తుంది. ఇది మనకు రోజుకు కావల్సిన విటమిన్ కె లో 20 శాతంతో సమానం. విటమిన్ కె గాయాలు అయినప్పుడు తీవ్ర రక్త స్రావం అవకుండా రక్తం గడ్డ కట్టేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. తరచూ అవకాడోలను తినడం వల్ల ఎముకలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అవకాడోలలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల అవకాడోలతో సుమారుగా 10 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. దీంతోపాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కనుక అవకాడోలను రోజూ తింటుంటే అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.