Womens Health | వయస్సు పైబడుతున్న కొద్దీ స్త్రీలలో శక్తి సన్నగిల్లుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. పురుషుల కన్నా స్త్రీలే ముందుగా బలహీనంగా మారుతారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన స్త్రీలలో కండరాలు బలహీనంగా మారుతాయి. ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతాయి. దీంతో చిన్న పనిచేసినా అలసిపోతుంటారు. అయితే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన స్త్రీలు ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీసుకుంటే శరీరానికి శక్తి లభించడమే కాదు, ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. యాక్టివ్గా ఉంటారు. ఇక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్లలో ప్రోటీన్లు సమృద్ధిగానే ఉంటాయి. 100 గ్రాముల కోడిగుడ్లను తింటే సుమారుగా 13 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. కనుక 40 ఏళ్లు దాటిన మహిళలు రోజుకు ఒక కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. కోడిగుడ్లలో శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పలు అమైనో యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక మహిళలు రోజుకు ఒక కోడిగుడ్డును తినాల్సి ఉంటుంది. అదేవిధంగా వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు చేపలను తింటుండాలి. ముఖ్యంగా సముద్రపు చేపలను తినాలి. 100 గ్రాముల సముద్రపు చేపలను తింటే సుమారుగా 25 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడును యాక్టివ్గా పనిచేసేలా చేస్తాయి.
బాదంపప్పులోనూ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. రోజూ గుప్పెడు బాదంపప్పును నీటిలో నానబెట్టుకుని ఉదయం తినాలి. 100 గ్రాముల బాదంపప్పును తింటే సుమారుగా 21 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. ఈ పప్పులను తినడం వల్ల స్త్రీలు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే మొలకెత్తిన పెసలను కూడా రోజూ తినవచ్చు. 100 గ్రాముల పెసలను తినడం ద్వారా సుమారుగా 24 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. పెసలు చాలా సులభంగా జీర్ణం అవుతాయి. వీటిల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు పెసల ద్వారా లభిస్తాయి. దీంతో స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారు.
పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. 100 గ్రాముల పప్పు దినుసులను తింటే సుమారుగా 25 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. పప్పు దినుసుల ద్వారా వృక్ష సంబంధ ప్రోటీన్లు అందుతాయి. ఇవి జీర్ణక్రియను పెంపొందిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. స్త్రీలను అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి పప్పు దినుసులను వారు కచ్చితంగా తినాలి. అలాగే ప్రోటీన్ల కోసం చియా విత్తనాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. 100 గ్రాముల చియా విత్తనాలను తింటే సుమారుగా 17 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. ఈ విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శక్తి స్థాయిలను పెంచుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ఇలా 40 ఏళ్లు దాటిన స్త్రీలు ఆయా ఆహారాలను రోజూ తినడం వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. వృద్ధాప్యంలోనూ యాక్టివ్గా ఉంటారు.