కేశాల విటమిన్
శీతకాలం జుట్టుకు కష్టకాలమే. పొడిగాలుల వల్ల చుండ్రు దాడి చేస్తుంది. దీంతోపాటు అనేక కారణాల వల్ల చలికాలంలో జుట్టు రాలిపోతుంది.
శీతకాలం జుట్టుకు కష్టకాలమే. పొడిగాలుల వల్ల చుండ్రు దాడి చేస్తుంది. దీంతోపాటు అనేక కారణాల వల్ల చలికాలంలో జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యకు విటమిన్-ఇ అడ్డుకట్ట వేసి తీరుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. విటిమిన్-ఇలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయి. కణాలు దెబ్బతినకుండా, మళ్లీ వెంట్రుకలు పెరగడంలో లోపం లేకుండా చూస్తాయి.

వయసుతో పాటే కేశాలు బలహీనపడటంలో ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పాత్ర కీలకం. విటమిన్-ఇ లోని యాంటీఆక్సిడెంట్స్ వీటిని అదుపు చేస్తాయి. పాలిష్ పట్టని బియ్యం, బొప్పాయి, పాలకూర, బాదంపప్పు.. లాంటి ఆహార పదార్థాల్లో విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్-ఇ జోడించిన షాంపూ, కండిషనర్, తలనూనెలను వాడటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. సప్లిమెంట్ల రూపంలో ఈ విటమిన్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

