Sleep | శారీరకంగా అలసిపోయినా కొందరికి నిద్ర పట్టదు.. కారణం ఏమిటి..?
శారీరకంగా చాలా అలసిపోయినప్పటికీ కొంతమందికి రాత్రిపూట నిద్ర పట్టదు. దీనికి కారణం శరీరం అలసిపోవడం ఒక్కటే నిద్ర రావడానికి సరిపోకపోవడమే. మెదడు నిద్రకు సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా ముఖ్యమే. శరీరం అలసిపోయినా మన అంతర్గత జీవ గడియారం నిద్రపోయే సమయం వచ్చిందనే సంకేతాన్ని ఇవ్వదు. ఈ గడియారాన్ని జీవ లయ అంటారు.
Sleep | శారీరకంగా చాలా అలసిపోయినప్పటికీ కొంతమందికి రాత్రిపూట నిద్ర పట్టదు. దీనికి కారణం శరీరం అలసిపోవడం ఒక్కటే నిద్ర రావడానికి సరిపోకపోవడమే. మెదడు నిద్రకు సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా ముఖ్యమే. శరీరం అలసిపోయినా మన అంతర్గత జీవ గడియారం నిద్రపోయే సమయం వచ్చిందనే సంకేతాన్ని ఇవ్వదు. ఈ గడియారాన్ని జీవ లయ అంటారు. ఇది దాదాపు 24 గంటల వ్యవధిలో నిద్ర, మెళకువతోపాటు శరీరంలోని అనేక ప్రక్రియలను నియంత్రిస్తుంది. వెలుతురు, ఉష్ణోగ్రత వంటి పరిసర పరిస్థితులు దీనిపై ప్రభావం చూపుతాయి.
మెలటోనిన్‌కు ఆటంకం కలిగితే..
మెదడులోని హైపోథాలమస్ ప్రాంతం జీవ లయను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పగటిపూట సహజమైన సూర్యకాంతి శరీరానికి మెళకువగా ఉండాల్సిన సమయమని సంకేతాలు ఇస్తుంది. చీకటి పడినప్పుడు నిద్రను ప్రోత్సహించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ జీవ లయ నిద్రలోని వివిధ దశలను, ముఖ్యంగా గాఢ నిద్రను, స్వప్నాలతో సంబంధం ఉన్న ఆర్ఈఎం నిద్రను ప్రభావితం చేస్తుంది. అందువల్ల నిద్ర ఎంత నాణ్యంగా ఉందో, ఉదయం లేచినప్పుడు ఎంత ఉత్సాహంగా అనిపిస్తుందో కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. రాత్రిపూట ఫోన్, కంప్యూటర్ తెరలను ఎక్కువసేపు చూడడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతంది. పని, సామాజిక మాధ్యమాలు, వార్తలు, ఒత్తిడి మెదడును ఇంకా చురుగ్గా ఉంచుతాయి.
ఉదయం కాంతి ముఖ్యం..
నిద్రను మెరుగుపరచుకోవడానికి ఉదయం కొంతసేపు సహజమైన వెలుతురులో గడపాలి. ఇది శరీర జీవ గడియారాన్ని క్రమబద్ధం చేయడానికి సహాయపడుతుంది. రాత్రిపూట ప్రకాశవంతమైన దీపాలు, ఫోన్ తెరల వినియోగాన్ని తగ్గించాలి. అవసరమైతే తెరలపై నీలి వెలుతురును తగ్గించే సదుపాయాలను ఉపయోగించుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించడం, ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. వారాంతాల్లో కూడా ఈ క్రమాన్ని పాటించడం మంచిది. మధ్యాహ్నం తర్వాత, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కాఫీ వంటి ఉత్తేజక పదార్థాలను తగ్గించాలి. ఇది నిద్ర పట్టడాన్ని ఆలస్యం చేస్తుంది.
నిద్రించే ముందు ఇలా చేయాలి..
నిద్రించే ముందు పుస్తకం చదవడం లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటి ప్రశాంతమైన పనులు చేయడం వల్ల శరీరం విశ్రాంతికి సిద్ధమవుతుంది. పగటిపూట నిద్రపోవాల్సి వస్తే 20 నుంచి 30 నిమిషాలకు పరిమితం చేయాలి. ముఖ్యంగా సాయంత్రం ఆలస్యంగా నిద్రపోవడం రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. నిద్రించే ముందు మెదడుకు విశ్రాంతి ఇవ్వడం, తెరల వినియోగాన్ని తగ్గించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. శారీరక అలసట ఉన్నప్పటికీ నిద్ర రాకపోవడానికి జీవ లయలో మార్పులు ఒక కారణం అయ్యే అవకాశాలు ఉంటాయి. నిద్ర సమస్య తరచూ కొనసాగుతూ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sleep | శారీరకంగా అలసిపోయినా కొందరికి నిద్ర పట్టదు.. కారణం ఏమిటి..?
Scene Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’.. నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్
Varanasi | ‘వారణాసి’ ఓటీటీ డీల్‌పై అసంతృప్తి .. భారీ ధర కోసం రాజమౌళి టీమ్ ఎదురుచూపులు!
Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం..!
Neeraj Yadav: ఏషియన్ పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

