Millets | ప్రస్తుతం చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అందుకనే ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఒకప్పుడు మన పూర్వీకులు తిన్న చిరు ధాన్యాలను ఇప్పుడు చాలా మంది తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. చిరు ధాన్యాలనే సిరి ధాన్యాలు, మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం చాలా మంది వీటిని తింటున్నారు. మిల్లెట్స్‌ను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అందుకనే చాలా మంది తమ రోజు వారి ఆహారంలో మిల్లెట్స్‌ను భాగం చేసుకుంటున్నారు. మిల్లెట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అనేక వ్యాధులను తగ్గించేందుకు సహాయం చేస్తుంది. అయితే మిల్లెట్స్‌లో అనేక రకాలు ఉంటాయి. మనకు ఉన్న భిన్న రకాల వ్యాధులను బట్టి భిన్నమైన మిల్లెట్స్‌ను తినాల్సి ఉంటుంది. అప్పుడే ఆశించిన స్థాయిలో ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
మిల్లెట్స్‌లో కొర్రలు కూడా ఒకటి. వీటినే ఫాక్స్‌టెయిల్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. వీటిల్లో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కొర్రలు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. శిశువు ఎదుగుదలకు సహాయం చేస్తాయి. గర్భిణీల్లో వచ్చే మలబద్దకాన్ని తగ్గిస్తాయి. జ్వరం వచ్చిన చిన్నారులకు కొర్రలను పెడితే త్వరగా కోలుకుంటారు. కొర్రలను తినడం వల్ల నరాల బలహీనత, చర్మ సమస్యలు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, పార్కిన్సన్ వ్యాధి, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అలాగే అరికలు లేదా కోడో మిల్లెట్స్‌ను తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిని తింటే రక్తశుద్ధి జరుగుతుంది. ఎముకల్లో గుజ్జు ఏర్పడి బలంగా మారుతాయి. ఆస్తమా, కిడ్నీ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు, బ్లడ్ క్యాన్సర్, పేగులు, థైరాయిడ్, గొంతు సమస్యలు, క్లోమ గ్రంథి సమస్య, కాలేయ వ్యాధులు, కాలేయ క్యాన్సర్, డయాబెటిస్, డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు ఉన్నవారు అరికలను తింటుంటే మేలు జరుగుతుంది.
చిరు ధాన్యాల్లో ఒకటైన సామలు లేదా లిటిల్ మిల్లెట్స్‌ను తింటే స్త్రీలలో పీసీవోఎస్ సమస్య తగ్గుతుంది. పురుషుల్లో అయితే వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే సామలను తినడం వల్ల మెదడు, గొంతు సమస్యలు, బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంథి సమస్యలు తగ్గుతాయి. ఇక ఊదలు లేదా బమ్యార్డ్ మిల్లెట్స్‌ను తినడం వల్ల థైరాయిడ్, షుగర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే లివర్, బ్లాడర్, గర్భాశయ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తింటుంటే మేలు జరుగుతుంది. ఇక అండుకొర్రలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్స్‌ను తినడం వల్ల మొలలు, భగంద్రం, మూలశంక, ఫిషర్స్, అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకలు, జీర్ణాశయం, పేగులు, చర్మ సమస్యలు తగ్గుతాయి.
ఇక రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్‌ను తినడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు శక్తి లభిస్తుంది. షుగర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. శిరోజాలకు మేలు జరుగుతుంది. అలాగే సజ్జలు లేదా పెరల్ మిల్లెట్స్‌ను తింటే జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గర్భిణీలకు మేలు జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా జొన్నలు లేదా సోర్గమ్ మిల్లెట్స్‌ను తింటుంటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. కండరాలకు శక్తి లభిస్తుంది. ఇలా ఆయా అనారోగ్య సమస్యలు ఉన్నవారు భిన్న రకాల మిల్లెట్స్‌ను తినడం వల్ల ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.