మా బాబు వయసు ఆరేండ్లు. నేను గర్భిణిగా ఉన్నప్పుడు, కాన్పు సమయంలో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. శిశువు కూడా బాగానే ఉన్నాడు. ఈ మధ్య తరచూ పొట్టలో నొప్పి అంటున్నాడని వైద్యుణ్ని సంప్రదించాం. స్కాన్ చేశాక రెండు కిడ్నీల్లో ఒకటి లేదని చెప్పారు. ఇప్పటిదాకా బాబు ఆరోగ్యపరంగా ఇబ్బందిపడిన దాఖలాల్లేవు. ఇంకా ఏవో పరీక్షలు చేయాలన్నారు. ఇలా ఒకే కిడ్నీతో పెరిగే పిల్లలకు ఎలాంటి సమస్యలు వస్తాయి! బాబు విషయంలో మేం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించండి?
ఓ పాఠకురాలు
బాబుకు స్కానింగ్ చేసిన తర్వాత ఒక కిడ్నీ కనిపించడం లేదని చెబుతున్నారు. అయితే ఒకే కిడ్నీ ఉందా, రెండో కిడ్నీ అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కనిపించనంత చిన్నగా ఎక్కడైనా ఉందా అని నిర్ధారించుకోవాలి. ఈ ఒక్క కిడ్నీ పనితనం ఎలా ఉంది? దీనికి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించాలి. దాదాపు రెండువేల మంది శిశువుల్లో ఒకరు ఇలా ఒకే కిడ్నీతో పుడుతుంటారు. ఈ సమస్య జన్యుపరమైనది అయ్యే ఆస్కారం ఉంది. మీకు గానీ, మీ భర్తకు గానీ కిడ్నీ సమస్యలు ఉన్నట్టయితే.. పిల్లాడికి ఈ సమస్య రావొచ్చు. అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట! ఒక్కోసారి కుటుంబంలో ఎవరికీ ఇబ్బంది లేకున్నా.. ఆకస్మికంగా జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్) కారణంగా ఈ ఇబ్బంది తలెత్తవచ్చు. అయితే, ఒక కిడ్నీ ఉన్నవాళ్లు కూడా సాధారణంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ, దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్‌ను కలిసి, వారి సూచన మేరకు కిడ్నీ ఫంక్షనింగ్ పరీక్షలు, డీఎమ్‌ఎస్‌ఏ స్కాన్, ఇతర స్కాన్లు చేసి.. ఈ కిడ్నీ ఎలా పనిచేస్తున్నదో తెలుసుకోవడం అవసరం. ఒకే కిడ్నీతో పుట్టాడా, రెండో కిడ్నీ చిన్నగా అయిపోయిందా.. నిర్ధారించి వైద్యులు తగు చికిత్స అందిస్తారు. అంతేకాదు, మీ బాబు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్యంగా ఉన్న కిడ్నీ మీద ప్రభావం పడకుండా ఈ సూచనలు పాటించాలి..