Anti Oxidants | సాధారణంగా మనం పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. చక్కని ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో అవసరమనే విషయం మనందరికీ తెలిసిందే. మన శరీరానికి అవసరమయ్యే వాటిల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఒకటి . యాంటీఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడే అణువులు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను తటస్థీకరిస్తాయి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మనల్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయి. మన మొత్తం శరీర ఆరోగ్యానికి మద్దతును ఇస్తాయి. అనేక మొక్క ఆధారిత ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, ఇ, సెలినీయం, ఫ్లేవనాయిడ్స్, ఫ్లేవోన్లు, ఫైటో కెమికల్స్ అన్నీ కూడా సాధారణ యాంటీ ఆక్సిడెంట్లల్లో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక విధాలుగా మేలు కలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి వైద్యులు వివరిస్తున్నారు.
వృద్దాప్య ఛాయలను తగ్గించడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎంతో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల యూవీ కిరణాల నుండి, కాలుష్యం నుండి కూడా చర్మానికి రక్షణ లభిస్తుంది. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. మొత్తం చర్మ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల కలిగే ఆక్సీకరణను, రక్తపోటును తగ్గించడంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు మనకు దోహదపడతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చక్కని గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల వయసు పైబడడం వల్ల వచ్చే అభిజ్ఞా క్షీణత తగ్గుతుంది. అల్జీమర్స్ వంటి సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. విటమిన్ సి, ఇ వంటి ఆహారాలను, యాంటీ ఆక్సిడెంట్లను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. శరీరానికి ఇన్పెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చేకంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
కూరగాయలు, పండ్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ తో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అలాగే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇలా అనేక విధాలుగా యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బెర్రీస్, కాఫీ, గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్, బెల్ పెప్పర్ వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే నారింజ, బొప్పాయి, దానిమ్మ, వివిధ రకాల ఆకుకూరలు కూడా యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.