Weight Loss Diet | అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు. అయితే బరువును తగ్గించుకోవడంలో ఆహారం ముఖ్య పాత్రను పోషిస్తుంది. మనం రోజూ తినే ఆహారంలో పలు మార్పులు చేసుకుంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చు. పలు ఆహారాలు మనకు బరువు తగ్గేందుకు ఎంతగానో దోహదపడతాయి. రోజూ వ్యాయామం చేసేవారు లేదా శారీరక శ్రమ చేసేవారు డైట్ విషయంలోనూ జాగ్రత్తలను పాటిస్తే బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు శరీర మెటబాలిజాన్ని పెంచి బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. ఆయా ఆహారాలను తీసుకోవడం వల్ల పలు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
ఆకుకూరలను వారంలో కనీసం 3 సార్లు అయినా తినాలి. ఆకుకూరలను తినడం వల్ల క్యాలరీలు తక్కువగా, పోషకాలు అధికంగా లభిస్తాయి. ఆకుకూరల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో దోహదపడుతుంది. కనుక ఆకుకూరలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు పలు రకాల సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా గ్రీన్ టీని రోజూ తాగాల్సి ఉంటుంది. రోజుకు 2 కప్పుల గ్రీన్ టీని సేవిస్తుంటే బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.
కోడిగుడ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. కోడిగుడ్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. కనుక రోజూ ఉదయం గుడ్లను తింటే మేలు జరుగుతుంది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీల వంటి బెర్రీ పండ్లను తినడం వల్ల క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. వీటిల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా సమృద్ధిగానే ఉంటాయి. అందువల్ల బెర్రీ పండ్లను తింటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
అవకాడోలలో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. ఆవకాడోల్లో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. కనుక అవకాడోలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. పెరుగులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గుతారు. ఇలా పలు రకాల ఆహారాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.