Green Apples | యాపిల్స్ అంటే సహజంగానే చాలా మందికి ఎరుపు రంగులో ఉండే పండ్లే గుర్తుకు వస్తాయి. కానీ యాపిల్స్‌లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో గ్రీన్ యాపిల్స్ కూడా ఒకటి. మనకు ఇవి బయట సూపర్ మార్కెట్లు, పండ్ల దుకాణాల్లో లభిస్తాయి. గ్రీన్ యాపిల్‌ను సాధారణంగా చాలా మంది పట్టించుకోరు. కానీ ఇవి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ యాపిల్స్ మనకు ఎంతో మేలు చేస్తాయని వారు అంటున్నారు. రోజువారి ఆహారంలో గ్రీన్ యాపిల్స్‌ను భాగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. గ్రీన్ యాపిల్స్‌ను 182 గ్రాములు తింటే 95 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 25 గ్రాములు, ఫైబర్ 4 గ్రాములు, చక్కెర 19 గ్రాములు, ఇతర పోషకాలు మనకు గ్రీన్ యాపిల్స్ ద్వారా లభిస్తాయి.
గ్రీన్ యాపిల్స్‌ను తినడం వల్ల విటమిన్లు సి, ఎ, కె, ఎ, బి1, బి2, బి6 సమృద్ధిగా లభిస్తాయి. అలాగే పొటాషియం, ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ వంటి పోషకాలు సైతం వీటి ద్వారా మనకు అధికంగా లభిస్తాయి. గ్రీన్ యాపిల్స్‌ను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిల్లో పెక్టిన్ అనే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గ్రీన్ యాపిల్స్‌లో ఉండే ఫైబర్ కారణంగా పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. విరేచనాల నుంచి బయట పడవచ్చు. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు గ్రీన్ యాపిల్స్‌ను తింటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ పండ్లను తింటే ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
గ్రీన్ యాపిల్స్‌లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అలాగే వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు సైతం నిర్భయంగా ఈ పండ్లను తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ ఏమాత్రం పెరగవు. పైగా గ్రీన్ యాపిల్స్‌లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గ్రీన్ యాపిల్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గ్రీన్ యాపిల్స్ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తాయి. వీటిల్లో అధికంగా ఉండే ఫైబర్ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. గ్రీన్ యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె జబ్బులతోపాటు క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. గ్రీన్ యాపిల్స్‌ను తింటే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ క్లీన్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఇలా గ్రీన్ యాపిల్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.