Wake Up | మన దేశానికి చెందిన ఎంతో మంది నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల్లో సీఈవోలుగా, ఇతర అత్యున్నత స్థానాల్లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంతటి స్థాయికి చేరుకోవడం సాధారణ పౌరులకు అసలు వీలుకాదు. అయితే అలా సక్సెస్ సాధించాలంటే ఊరికే తిని కూర్చుంటే కాదు, కష్టపడి పనిచేయాలి. అందుకు గాను ఉదయం త్వరగా నిద్ర లేవాల్సి ఉంటుంది. సక్సెస్ సాధించి అత్యున్నత స్థానాల్లో ఉండే ఉద్యోగులు లేదా వ్యాపారులు ఎవరైనా సరే ఉదయమే నిద్ర లేస్తారు. ఉదయం 5 గంటలకు వారు నిద్ర లేస్తారు కనుకనే జీవితంలో అంత ఎత్తుకు ఎదగగలిగారు. అందుకనే మన పెద్దలు కూడా ఉదయం త్వరగా నిద్రలేవాలని చెబుతుంటారు. ఉదయం త్వరగా నిద్ర లేచేవారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని మనస్తత్వ శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోజూ ఉదయం త్వరగా నిద్ర లేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఉదయం త్వరగా నిద్రలేచేవారిలో ఒత్తిడి స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక ఉదయం త్వరగా నిద్రలేవాలి. దీంతో మీరు ఆ రోజు చేయాలనుకున్న పనిపై ఉదయమే ధ్యాస పెట్టగలుగుతారు. దీంతో ఆ రోజు చేయాల్సిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కావాలంటే 3 రోజుల పాటు ఉదయమే త్వరగా నిద్ర లేచి చూడండి. రోజులో చేయాల్సిన పనిని ఉదయమే ప్రారంభిస్తారు కనుక త్వరగా పని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఒత్తిడి స్థాయిలు ఆటోమేటిగ్గా తగ్గుతాయి. ఉదయం త్వరగా నిద్రలేస్తే వ్యాయామం చేసేందుకు కూడా చాలా సమయం ఉంటుంది. సాయంత్రం చేసే వ్యాయామం కన్నా ఉదయం చేసే వ్యాయామం చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అలాగే అధిక బరువు తగ్గుతారు. షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి.
ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల మీకు ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. దీంతో ఉదయమే పోషకాహారం తినవచ్చు. ఇది మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. యాక్టివ్గా పనిచేసేలా చేస్తుంది. దీంతోపాటు పోషకాలను కూడా అందిస్తుంది. ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల మన జీవ గడియారం సరిగ్గా పనిచేస్తుంది. ఇది క్రమబద్దంగా ఉంటే అనేక రకాల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం సూర్యరశ్మిలో గడిపే అవకాశం లభిస్తుంది. ఆ సమయంలో వ్యాయామం చేస్తూ శరీరం ఎండ తగిలేలా ఉంటే విటమిన్ డిని పొందవచ్చు. ఇది ఇమ్యూనిటీని పెంచడంతోపాటు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతోపాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ఉదయం త్వరగా నిద్రలేచే వారిలో ఒత్తిడి, ఆందోళన స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీరు ఇతరులతో పోలిస్తే చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. కొద్ది రోజుల పాటు మీరు ఉదయం త్వరగా నిద్రలేవడాన్ని అలవాటు చేసుకుంటే తరువాత మీకు ఆ దినచర్య అలవాటై పోతుంది. దీంతో రాత్రి త్వరగా నిద్రిస్తారు. జీవ గడియారం సరిగ్గా పనిచేస్తుంది. దీంతో షుగర్, గుండె పోటు రాకుండా ఉంటాయి. అలాగే నిద్ర సరిగ్గా లభిస్తుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు పెరగకుండా చూస్తుంది. ఇలా ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.